టాలీవుడ్ మీద ఫోకస్ చేస్తున్న తమిళ హీరోలు

Edited By:

Updated on: Jul 19, 2026 | 10:37 AM

యంగ్ తెలుగు హీరోలు ఒకే సినిమాపై ఎక్కువ సమయం కేటాయిస్తుండగా, ఆ గ్యాప్‌ను ఇతర భాషల హీరోలు సమర్థంగా వినియోగించుకుంటున్నారు. దుల్కర్ సల్మాన్, ఫహాద్ ఫాజిల్, పృథ్వీరాజ్, టొవినో థామస్‌తో పాటు పలువురు తమిళ, మలయాళ నటులు డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు మార్కెట్‌లో బలమైన స్థానాన్ని సంపాదిస్తూ పోటీని మరింత పెంచుతున్నారు.

తొందరపడి సినిమాలు చేసిన నిరాపరిచే కన్నా… పక్కా ప్లానింగ్‌తో ఆడియన్స్‌ ముందుకు రావాలన్నది యంగ్ హీరోల ప్లానింగ్‌. అయితే వాళ్ల కెరీర్‌ పరంగా అది మంచి నిర్ణయమే ఇండస్ట్రీ పరంగా మాత్రం కరెక్ట్ కాదన్న టాక్ వినిపిస్తోంది. ఇంతకీ కుర్ర హీరోలు చేస్తున్న ఆలస్యం ఎవరికీ ప్లస్ అవుతోంది. మన హీరోలు ఏళ్ల తరబడి ఒకే సినిమా మీద వర్క్ చేస్తుండటంతో ఈ గ్యాప్‌ను పరభాషా హీరోలు క్యాష్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ దుల్కర్ సల్మాన్ వరుసగా తెలుగు సినిమాలు చేస్తున్నారు. మన హీరోలతో సమానంగా మార్కెట్‌ను కూడా సంపాదించుకున్నారు. పుష్ప సినిమాతో విలన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఫహాద్ ఫాజిల్ కూడా ఇప్పుడు హీరోగా మారుతున్నారు. డోంట్‌ ట్రబుల్‌ ద ట్రబుల్‌ సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వీళ్లే కాదు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, టొవినో థామస్‌ లాంటి స్టార్స్‌ డబ్బింగ్‌ సినిమాలతో మన మార్కెట్‌లో సత్తా చూపిస్తున్నారు. తమిళ హీరోలు తెలుగు మార్కెట్‌ను హోం గ్రౌండ్‌లా ఫీల్ అవుతున్నారు. గతంలో రజనీ, కమల్ లాంటి ఒకరిద్దరు హీరోలకే తెలుగులో మార్కెట్ ఉండేది. కానీ ఇప్పుడు కోలీవుడ్ హీరోలంతా తెలుగు మార్కెట్‌లో ప్లేస్ కోసం కష్టపడుతున్నారు. దీంతో మన సినిమాలకు పోటీగా డబ్బింగ్ సినిమాలు కూడా సత్తా చాటుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:
తెర వెనుక డ్యాన్సర్ల కన్నీళ్లు.. కమిషన్ల దందా! జానీ మాస్టర్‌ది మొండిపట్టేనా?

ఉత్తమ పాపులర్ చిత్రం గా ‘కల్కి 2898 AD

 

Published on: Jul 19, 2026 10:36 AM
Loading...
Unable to load recommendations.
Follow Us