Mohan Babu: కిడ్నాప్ కేసులో.. మోహన్ బాబుకు బిగ్ షాక్

Updated on: Feb 21, 2026 | 12:12 PM

సినీ నటుడు మోహన్ బాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కిడ్నాప్ కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. అనుబంధ పిటిషన్‌ను కూడా కొట్టివేసింది. ఫోరెన్సిక్ నివేదిక వచ్చేవరకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేస్తూ, తదుపరి విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది. ఇది మోహన్ బాబుకు ఎదురుదెబ్బగా పరిగణించబడుతోంది.

సినీ నటుడు మోహన్ బాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కిడ్నాప్ కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. క్వాష్ పిటిషన్ పై తదుపరి విచారణ మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది .. అయితే, విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు మంచు మోహన్‌బాబు.. అయితే, ఫోన్ కాల్స్ తో పాటు మెసేజ్‌లను విశ్లేషించి ఫోరెన్సిక్ ల్యాబరేటరీ నివేదిక అందజేయాల్సి ఉందని హైకోర్టు పేర్కొంది.. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది.. ఎఫ్ఐఆర్ ఆధారంగా తదుపరి చర్యలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని మోహన్ బాబు తరుపు న్యాయవాది చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. అనుబంధ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది.. వ్యాజ్యంపై లోతైన విచారణ జరుపుతామని మార్చి 3వ తేదీకి క్వాష్ పిటిషన్ విచారణ వాయిదా వేసింది..

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Chiranjeevi: ఓ శశిరేఖా.. ఓ మాట చెప్పాలి

చూపు కోల్పోయిన 9 మంది.. వికటించిన కంటి వైద్యం

శ్రీశైలం మల్లన్నకు కాసుల వర్షం..13 రోజుల్లోనే ఏకంగా..

పెళ్లి కూతురిపై నోట్ల వర్షం.. రూ. 8.5 కోట్లు వెదజల్లిన ఫ్యామిలీ!

తను కూర్చున్న కొమ్మనే నరుక్కున్నాడు.. చివరికి..

Follow Us