Anupama Parameswaran: ‘నా గొంతు నేనే వినిపిస్తా’.. అనుపమ ఎమోషనల్ పోస్ట్ వెనక అసలు కథ ఏంటి?

Edited By:

Updated on: Jul 21, 2026 | 6:39 PM

అనుపమ పరమేశ్వరన్ చేసిన ఓ భావోద్వేగ సోషల్ మీడియా పోస్ట్ అభిమానుల్లో చర్చకు దారి తీసింది. “ఇకపై నా గొంతు నేనే వినిపిస్తాను” అంటూ చేసిన వ్యాఖ్యలతో వ్యక్తిగత జీవితంలో ఏదైనా కీలక మార్పు జరిగిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ పోస్ట్‌కు అసలు కారణమేంటనే విషయంపై అనుపమ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు.

ఒక్క పోస్టుతో హాట్ టాపిక్ అయిపోయారు అనుపమ పరమేశ్వరన్. ఇకపై నా వాయిస్ నేనే వినిపిస్తాను.. నా సొంత దారి నేనే ఎంచుకుంటున్నాను.. పనికిరాని గతాన్ని వదిలేసి ఎట్టకేలకు మనశ్శాంతిని కనుగొన్నాను అంటూ ఈ బ్యూటీ చేసిన పోస్ట్ వైరల్ అవుతుందిప్పుడు. ఈ ఎమోషనల్ పోస్ట్ వెనక ఏదో ఉందంటూ ఆరాలు తీయడం మొదలుపెట్టారు అభిమానులు. విక్రమ్ తనయుడు ధృవ్‌తో అనుపమ ప్రేమలో ఉన్నారనే వార్తలు చాలా కాలంగా వైరల్ అవుతున్నాయి.. ఇప్పుడు ఈ రిలేషన్ ఏమైనా బ్రేక్ అయిందా.. అందుకే ఇలాంటి పోస్ట్ పెట్టారా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఒకవేళ ఇది కాకపోతే వ్యక్తిగత జీవితంలో లేదా కెరీర్‌లో ఏదైనా పెద్ద మార్పును సూచిస్తూ ఇలా రాసారా అని లెక్కలేసుకుంటున్నారు ఫ్యాన్స్. తన లేటెస్ట్ పోస్ట్‌పై అనుపమ పరమేశ్వరన్ మౌనం అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెంచుతుంది. ఆమె రాసిన క్యాప్షన్‌లో అర్థం ఏంటా అని ఒక్కో లైన్‌ను జల్లడేస్తున్నారు ఫ్యాన్స్. కొన్నిసార్లు మనశ్శాంతి కావాలంటే ఇంకొన్ని వదిలేయాల్సి ఉంటుంది.. ఈ రోజు నాకు ఆ శాంతి దొరికిందనే బలమైన పదాలను వాడేసారు ఈ బ్యూటీ. మరి ఈమె ఫ్రీడమ్‌ను ఇన్నాళ్ళూ ఎవరు దోచేసారనేది అనుపమే క్లారిటీ ఇవ్వాలిక.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mamitha Baiju: నెల రోజుల్లో మూడు భారీ సినిమాలు.. మమిత బైజు దండయాత్రకు రెడీ!

Ramayana Leak: ‘రామాయణ’ ట్రైలర్ లీక్ వెనక అసలు కథ ఏంటి..? పైరసీనా.. ప్రమోషన్ ప్లానా?

Bhagyasree Borse: ‘ఐరెన్ లెగ్’ అంటూ నన్నే ఎందుకు..? హిట్ తర్వాత భాగ్యశ్రీ బోర్సే ఘాటు కౌంటర్!

Salman Khan: కండల వీరుడికి ఏమైంది..? సల్మాన్ ఖాన్ కొత్త లుక్ చూసి షాక్‌లో అభిమానులు!

భారీ సినిమాల దర్శకుల కొత్త మిషన్.. చిన్న సినిమాలకు పాన్ వరల్డ్ సపోర్ట్!

Published on: Jul 21, 2026 06:38 PM
Follow Us