Anupama Parameswaran: వాడసలు మనిషేనా.. మాజీ లవర్‌పై అనుపమ పరమేశ్వరన్ నిప్పులు
అనుపమ పరమేశ్వరన్ తన గత టాక్సిక్ రిలేషన్‌షిప్‌ను "నరకం"గా అభివర్ణించారు. మాజీ ప్రియుడి ఆంక్షలు, స్వేచ్ఛను కోల్పోవడం వల్ల మానసికంగా ఎంతో వేదన అనుభవించానని తెలిపారు. అపరిచితుడు పాత్రలా అతని నిజస్వరూపం బయటపడిందని పేర్కొన్నారు. ఇప్పుడు కెరీర్‌పై దృష్టి సారించి, బ్రేకప్ బాధ నుంచి బయటపడి మళ్లీ సంతోషాన్ని వెతుక్కుంటున్నారు.
అనుపమ పరమేశ్వరన్ తన బ్రేకప్, గత రిలేషన్‌షిప్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రేమించేటప్పుడు అంతా బానే ఉన్నా, విడిపోయిన తర్వాత నరకమేనని ఆమె పేర్కొన్నారు. గతంలో తానొక టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో ఉన్నానని, ఎమోషనల్‌గా చాలా బాధపడ్డానని తెలిపారు. కొన్ని నెలలకే పెళ్లి దాకా మాటలు వచ్చినా, ఆ తర్వాతే తన మాజీ ప్రియుడి నిజ స్వరూపం బయటపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అతను తన బట్టలు, సోషల్ మీడియా పోస్టుల విషయంలో ఆంక్షలు విధించడంతో స్వేచ్ఛను పూర్తిగా కోల్పోయానని అనుపమ వివరించారు. అపరిచితుడు సినిమాలో విక్రమ్ పాత్రలాగా అతను క్షణానికొక రకంగా ప్రవర్తించేవాడని ఆమె సంచలన కామెంట్స్ చేశారు. ఈ చేదు అనుభవం వ్యక్తిగత జీవితం పైనే కాకుండా తన కెరీర్‌పైనా తీవ్ర ప్రభావం చూపిందని, డ్రాగన్ ప్రమోషన్స్‌కు కూడా వెళ్లనివ్వకుండా అడ్డుకున్నాడని అనుపమ వెల్లడించారు. ఈ బంధం ఇలాగే కొనసాగితే మనశ్శాంతి దూరమవుతుందని గ్రహించి బ్రేకప్ చెప్పానని తెలిపారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి తాను మానసికంగా చాలా మధనపడ్డానని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తన ఫోకస్ అంతా కెరీర్‌పైనే ఉందని, జీవితంలో మళ్లీ సంతోషాన్ని నింపుకునే పనిలో ఉన్నానని అనుపమ పరమేశ్వరన్ తెలిపారు. అయితే, తన మాజీ ప్రియుడి పేరును ఆమె బయటపెట్టలేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇంట్లో చోరీకి వచ్చి ఆ దొంగ చేసిన పనికి.. నవ్వకుండా ఉండలేరు!
రోడ్డు పై పులి ప్రత్యక్షం.. సెల్ఫీల కోసం ఎగబడిన జనం
హాస్టల్‌లో దెయ్యం..! భయంతో ఖాళీ చేసి వెళ్లిపోయిన విద్యార్ధినిలు