చారడేసి కళ్ల ఈ చిన్నారిని గుర్తుపట్టండి..ఇప్పుడు బుల్లితెరపై టాప్ యాంకర్ తనే.. చాల వరకు మీ అంచనా తప్పోచు..
ప్రస్తుతం సోషల్ మీడియాలో నటీనటుల చిన్ననాటి ఫోటోస్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. స్టార్ సెలబ్రెటీలు తమ అరుదైన ఫోటోస్.. జ్ఞాపకాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటున్నారు. అయితే తమ అభిమాన నటీనటుల చిన్ననాటి ఫోటోస్ చూసేందుకు..వారిని గుర్తుపట్టేందుకు నెటిజన్స్
ప్రస్తుతం సోషల్ మీడియాలో నటీనటుల చిన్ననాటి ఫోటోస్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. స్టార్ సెలబ్రెటీలు తమ అరుదైన ఫోటోస్.. జ్ఞాపకాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటున్నారు. అయితే తమ అభిమాన నటీనటుల చిన్ననాటి ఫోటోస్ చూసేందుకు..వారిని గుర్తుపట్టేందుకు నెటిజన్స్ కూడా తెగ ఆసక్తి చూపిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ ట్రెండ్ బాగా నడుస్తోంది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా భాషతో సంబంధం లేకుండా సీనియర్ నటీనటుల దగ్గర్నుంచి యంగ్ స్టార్స్ వరకు ప్రతి ఒక్కరూ తమ త్రోబ్యాక్ ఫోటోస్ షేర్ చేసుకుంటారు. ఇప్పుడు మరో ఫోటో తాజాగా నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంది.ఈ ఫోటోలో చారడేసి కళ్లతో.. బూరెబుగ్గలతో సీరియస్ లుక్ ఇస్తున్న ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా ? మీకోసం చిన్న క్లూ.. ప్రస్తుతం బుల్లితెరపై ఈ చిన్నదానిదే హావా.. మరోవైపు అవకాశాలు అందుకుంటూ వెండితెరపై కూడా అలరిస్తున్న ఈ బుజ్జాయి.. ప్రతి రోజూ బుల్లితెర ద్వారా ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఎవరో గుర్తుపట్టారా ? ఇటీవల ఈ ముద్దుగుమ్మ గురించి పలు రకాల రూమర్స్ సైతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే వాటిపై ఈ అమ్మడు స్పందించలేదు. యాంకర్‌గానే కాకుండా నటిగానూ తన సత్తా చాటుతుంది. ఇంతకీ ఈ చిన్నారి ఎవరో కాదు.. బుల్లితెరపై తన చలాకీతనంతో యాంకర్‌గా దూసుకుపోతున్న రష్మి గౌతమ్. ప్రముఖ కామెడీ షో జబర్ధస్త్ ద్వారా ప్రతి ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరిస్తోంది. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు యాంకర్‌గానూ రాణిస్తోంది. అలాగే ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ నెట్టింట్లో తెగ యాక్టివ్ గా ఉంటుంది.
మరిన్ని చూడండి ఇక్కడ:
Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…