Ram Charan: మాలతో చరణ్ పార్టీకి వెళ్లడంపై వివాదం !! శిరీష్ క్లారిటీ
అల్లు శిరీష్-నయనికల పెళ్లి సందడి మొదలైంది. ప్రీ-వెడ్డింగ్ పార్టీలో అయ్యప్ప మాలలో ఉన్న రామ్ చరణ్ పాల్గొనడంపై వివాదం చెలరేగింది. దీనిపై అల్లు శిరీష్ స్పందిస్తూ, రామ్ చరణ్ పార్టీ ప్రారంభం కాకముందే శుభాకాంక్షలు తెలిపి వెళ్ళిపోయారని, అప్పుడు అభ్యంతరకర వాతావరణం లేదని స్పష్టం చేశారు. ఈ వివరణతో నెటిజన్ల అభ్యంతరాలు తొలగిపోయాయి.
అల్లు కుటుంబంలో పెళ్లి సందడి షురూ అయింది. మార్చి 6న అల్లు శిరీష్-నయనికల గ్రాండ్ వెడ్డింగ్ జరగనుంది. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ వేడుకలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన నివాసంలో గ్రాండ్ గా పార్టీ ఇచ్చాడు. అందులో అల్లు శిరీష్- నయనిక, స్నేహా రెడ్డి, రామ్ చరణ్, ఉపాసన లో పాటు.. బన్నీ నియర్ అండ్ డియర్స్ పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. అయితే అయ్యప్ప మాలలో ఉన్న రామ్ చరణ్ ఈ పార్టీలో పాల్గొనడంపై కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో మద్యం, మాంసం ఉంటాయని మరి అలాంటప్పుడు మెగా హీరో పార్టీకి ఎలా వచ్చాడని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో అల్లు శిరీష్ దీనిపై రియాక్టయ్యాడు. రామ్ చరణ్ విషయంలో నెటిజన్లు చేస్తున్న కామెంట్స్ కు పూర్తి వివరణ ఇచ్చాడు. తమ పార్టీ ప్రారంభం కాకముందే రామ్ చరణ్ అక్కడికి వచ్చి వెళ్లిపోయాడు. ఆ సమయానికి అక్కడ ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం లేదంటూ శిరీష్ క్లారిటీ ఇచ్చాడు. రామ్ చరణ్ కూడా కేవలం హాల్ వరకు మాత్రమే వచ్చాడని.. తనకు నయనికకు శుభాకాంక్షలు చెప్పి వెంటనే అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారంటూ శిరీష్ చెప్పుకొచ్చాడు. రామ్ చరణ్ వెళ్లిన తర్వాతే పార్టీ మొదలైంది. అయ్యప్ప స్వామి మాల పట్ల రామ్ చరణ్‌కు ఎంతటి భక్తి, శ్రద్ధలున్నాయో అందరికీ తెలుసు. ఈ మాలలో ఉన్నప్పుడు రామ్ చరణ్ బయట కనీసం నీళ్లు కూడా తీసుకోరంటూ శిరీష్ చెప్పుకొచ్చాడు. శిరీష్ వివరణతో.. చరణ్‌ను విమర్శిస్తున్న వారందరూ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vijay-Rashmika Marriage: ఇద్దరి ఆలోచనా ధోరణి ఒక్కటే.. అందుకే కలిశారేమో..
Vijay-Rashmika Marriage: కట్టా- మీటా లాంటి లవ్ స్టోరీ.. ఎన్ని స్టేజ్‌లు దాటారంటే ??
Vijay-Rashmika Marriage: 9 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పడిన వేళ.. విరోషి పెళ్లి ఆనందభరితం
Bigg Boss Emmanuel: బిగ్ బాస్ ఓటమిని తలుచుకొని.. కన్నీళ్లు పెట్టుకున్న ఇమ్మూ
