Allu Arjun: బన్నీ వైన్‌ షాప్‌కు వెళ్లింది.. ఎవరికోసమో తెలిసింది.? వీడియో ఇదిగో..

Updated on: Nov 16, 2024 | 12:16 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షోకు విచ్చేశారు. సినిమాకు సంబంధించిన విశేషాలతో పాటే.. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్‌ విషయాలను తన ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ఈ క్రమంలోనే తను గతంలో గోవాలోని ఓ వైన్‌ షాపులో కనిపించిన వీడియో గురించి.. బాలయ్య అడగగానే చెప్పేశారు.

నా పేరు సూర్య షూటింగ్ కోసం గోవా వెళ్లానని.. అప్పుడే తన ప్రాణ స్నేహితుడు సందీప్ రామ్‏నేని కూడా అక్కడకు వచ్చాడని చెప్పిన బన్నీ.. తనకు ఏం కావాలని అడిగితే వైన్ లో ఒక బ్రాండ్ చెప్పారన్నాడు. తన కోసం తీసుకోవడానికే ఆ వైన్ షాపుకు వెళ్లినట్లు చెప్పాడు ఐకాన్ స్టార్. అయితే తన స్నేహితుడు అడిగిన బ్రాండ్ అక్కడ లేకపోవడంతో ఏమి కొనకుండానే వెనక్కి వచ్చినట్లు చెప్పుకొచ్చాడు.

అంతేకాదు ఆవెంటనే తన స్నేహితుడు సందీప్ రామ్‏నేనిని అన్ స్టాపబుల్ స్టేజ్ పైకి తీసుకువచ్చాడు బన్నీ. తన ఫ్రెండ్ బాలయ్య వీరాభిమానని అని చెబుతూ పరిచయం చేశాడు. తనకు సందీప్ బ్రెస్ట్ ఫ్రెండ్ అని.. చిన్ననాటి నుంచి స్నేహితులమని.. వీడు లేకుండా నేనుండలేను అంటూ తన స్నేహితుడిపై ఉన్న ప్రేమను బయటపెట్టాడు అల్లు అర్జున్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Loading...
Unable to load recommendations.
Follow Us