Dhurandhar 02: ధురంధర్‌ 2 కోసం.. ఏకంగా ఫిన్లాండ్ అధ్యక్షుడే వెయిటింగ్

Updated on: Mar 11, 2026 | 10:48 AM

ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్స్ భారత పర్యటనలో ధురంధర్ 2 సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదంపై పోరాటం నేపథ్యం తనకు నచ్చిందని, సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నానని ANI ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దీనికి తోడు, విడుదల కాకముందే ధురంధర్ 2 రికార్డులు సృష్టిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్‌లో తొలిరోజే రూ.18 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

సాధారణంగా ఒక దేశాధినేత మరొక దేశాన్ని సందర్శించినప్పుడు.. చర్చలతో.. ఒప్పందాలతో బిజీగా ఉంటారు. కానీ రీసెంట్‌గా మన దేశాన్ని విజిట్ చేసిన ఫిన్లాండ్ అధ్యక్షుడు మాత్రం.. ధరంధర్ 2 సినిమా గురించి మాట్లాడి అందర్నీ అవాక్కయ్యేలా చేశాడు. ఇక అసలు విషయం ఏంటంటే.. ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్స్ మార్చి 4 నుంచి 7 వరకు మన దేశంలో పర్యటించారు. ఈ సందర్భంగా, ప్రముఖ వార్తా సంస్థ ‘ANI’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ధురంధర్ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. భారతదేశానికి రాకముందు, తన కొడుకు ‘ధురంధర్’ సినిమా చూడమని అడగడంతో ఇంట్రెస్ట్ గా చూశానన్నాడు. ఉగ్రవాదంపై పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన ఈ కథ తనకు నిజంగా నచ్చిందన్నాడు స్టబ్స్‌. అంతేకాదు మార్చి 19న విడుదల కానున్న ధురంధర్ సీక్వెల్ కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ విషయం పక్కకు పెడితే.. రిలీజ్‌కు 11 రోజుల ముందే ధురంధర్‌ 2 మూవీ రికార్డుల వేట మొదలు పెట్టింది. అడ్వాన్స్ బుకింగ్స్‌ మొదలైన తొలి రోజే 18 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రేర్‌ రికార్డ్‌ సెట్ చేసింది. రణవీర్‌ సింగ్ హీరోగా ఆదిత్యధర్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై థ్రిల్లర్‌ మూవీ ధురంధర్‌ 2 మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

The Taj Story OTT: తాజ్ మహల్‌ శివుని ఆలయమా ?? OTTలోకి కాంట్రవర్సీ మూవీ..

Thanuja: ఫ్యాన్‌ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న తనూజ

Kamal Haasan: ఆ విషయం పై డోనాల్డ్ ట్రంప్‌ను హెచ్చరించిన కమల్ హాసన్

Loading...
Unable to load recommendations.
Follow Us