Akhil Akkineni: అక్కినేని అఖిల్ ఎంగేజ్‌మెంట్.! పెళ్లి తేదీని త్వరలో ప్రకటించనున్న నాగార్జున.
అక్కినేని నాగార్జున ఇంట పెళ్లి సంబరాలు స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పటికే నాగార్జున పెద్ద కొడుకు నాగ చైతన్య.. శోభితా ధుళిపాళను డిసెంబర్‌లో వివాహం చేసుకోనున్నాడు. ఇప్పుడు నాగార్జున రెండో కొడుకు అఖిల్ కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ క్రమంలోనే అఖిల్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు నాగార్జున. అఖిల్‌కు ఈరోజు జైనబ్‌తో నిశ్చితార్థం అయ్యింది.
జైనబ్‌ను మా ఫ్యామిలీలోకి ఆహ్వానించడం కంటే సంతోషమైన విషయం ఇంకొకటి లేదు. ఈ సంతోషమైన విషయాన్ని మీ అందరితో పంచుకోవాలి అనుకుంటున్నాను. మీ అందరి ఆశీస్సులు ఈ జంటపై ఉండాలి దీవించండి అంటూ పోస్ట్ చేశారు. అక్కినేని అఖిల్ నిశ్చితార్థం హైదరాబాద్ లో నాగార్జున ఇంట్లో ఘనంగా జరిగింది. ఈ ఉదయం ఓ శుభ ముహూర్తాన జుల్ఫీ రావ్‌జీ కుమార్తె ప్రముఖ ఆర్టిస్ట్ ‘జైనబ్ రావ్‌జీ’ వేలికి ఎంగేజ్ మెంట్ రింగ్ తొడిగాడు అఖిల్. ఈ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన అతికొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. ఢిల్లీకి చెందిన జైనబ్.. థియేటర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతూనే సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ గా కూడా ఉంది. అఖిల్ , జైనబ్ రావ్‌జీ కొన్ని సంవత్సరాల క్రితం కలుసుకున్నారు. అలా వారి పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో యువ జంట కొన్నేళ్లుగా ప్రేమలో ఉంది. ఇటీవల ఇరు కుటుంబ పెద్దలకు తమ ప్రేమను తెలియజేయడంతో అందుకు అక్కినేని ఫ్యామిలీతో పాటు జైనబ్ ఫ్యామిలీ అంగీకరించింది. ఆడంబరాలకు దూరంగా ఈ నిశ్చితార్థాన్ని నాగార్జున నివాసంలో నిర్వహించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.