Aishwarya Rai: కలుస్తూ.. విడిపోతూ.. సీరియల్‌లా సాగుతోంది వీరి జీవితం.! వీడియో..
అందాల తార ఐశ్వర్యరాయ్ బచ్చన్ వైవాహిక జీవితంపై గత కొన్ని నెలలుగా నటి రకరకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి. అభిషేక్, ఐష్ ల దాంపత్య బంధంలో మనస్పర్థలు వచ్చాయని రూమర్లు వినిపించాయి. త్వరలో ఈ బాలీవుడ్ కపుల్ విడాకులు కూడా తీసుకోబోతున్నారని ప్రచారం సాగింది. ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ పబ్లిక్‌గా కలిసి కనిపించకపోవడం వల్లే విభేదాలు వచ్చినట్లు జనాలు భావించారు.
అభిషేక్ బచ్చన్ కానీ, ఐశ్వర్యరాయ్ కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో గాసిప్‌లు మరీ ఎక్కువయ్యాయి. అయితే ఎట్టకేలకు ఈ రూమర్‌కు సింగిల్ ఫోటోతో చెక్ పెట్టారు ఈ స్టార్ కపుల్. అభిషేక్, ఐశ్వర్యల వివాహమై సుమారు 17 ఏళ్లు అవుతోంది. ఈ దంపతులకు ఆరాధ్య బచ్చన్ అనే కుమార్తె ఉంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఐష్- అభిషేక్ దూరంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు బలం చేకురుస్తూ అంబానీ ఫ్యామిలీ పెళ్లికి ఐశ్వర్య, అభిషేక్ విడివిడిగా వచ్చారు. ప్రస్తుతం ఐశ్వర్య తన తల్లితో కలిసి జీవిస్తున్నట్లు నెట్టింట గుసగుసలు వినిపించాయి. అయితే ఇప్పుడు వీటన్నింటికి పక్కకు పోయేలా చేస్తూ.. ఇటీవల అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ కలిసి ఒకే ఫోటోలో కనిపించారు. ఓ పార్టీకి కలిసి వెళ్లారు. ఇక అదే పార్టీలో.. ఉన్న బిజినెస్ మ్యాన్ అను రంజన్, నటి అయేషా జుల్కాతో వీరిద్దరూ సెల్ఫీ దిగారు.
అయితే ఈ ఫోటో బయటికి రావడం.. ఇక ఈ ఫోటోలో అభిషేక్, ఐష్ పక్క పక్కనే ఉండడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. అంతేకాదు వీరిద్దరూ కలిసే ఉన్నారనే క్లారిటీ అందరికీ ఇచ్చేంసింది. దాంతోపాటే క్రేజీ క్రేజీ కామెంట్స్ వచ్చేలా చేసుకుంటోంది ఈ ఫోటో! సోషల్ మీడియాల్లో .. గాసిప్స్‌లో.. రూమర్స్ అండ్ అన్ అఫీషియల్ న్యూసుల్లో వీరిద్దరూ కలుస్తూ.. విడిపోతూ.. సీరియల్ లా సాగుతోంది వీరి జీవితం అనే కామెంట్ ఎట్ ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.