నయన్ రికార్డ్‌పై కన్నేసిన మిసెస్ దేవరకొండ.. బాలీవుడ్‌లో రష్మికకు బిగ్ టెస్ట్

Edited By:

Updated on: May 20, 2026 | 7:10 PM

పెళ్లి తర్వాత బాలీవుడ్‌లో సౌత్ హీరోయిన్లు సక్సెస్ అవ్వడం చాలా అరుదు. ఆ ఫీట్ ఇప్పటి వరకు నయనతార మాత్రమే సాధించారు. ‘జవాన్’తో వెయ్యి కోట్ల హిట్ అందుకున్న ఆమె రికార్డ్‌ను ఇప్పుడు రష్మిక మందన్న టార్గెట్ చేస్తున్నారు. షాహిద్ కపూర్‌తో కలిసి నటిస్తున్న ‘కాక్‌టైల్ 2’పై రష్మిక భారీ ఆశలు పెట్టుకున్నారు. మరి మిసెస్ దేవరకొండ ఆ రికార్డ్ అందుకుంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

పెళ్లి తర్వాత హీరోయిన్లు సినిమాలు చేయడం పెద్ద మ్యాటర్ కాదు.. కానీ హిట్టు కొట్టడమే ఇక్కడ పెద్ద మ్యాటర్. అందులోనూ బాలీవుడ్‌కు వెళ్లి మన సౌత్ హీరోయిన్లు సక్సెస్ అవ్వడం అనేది చిన్న విషయమేమీ కాదు. ఆ రికార్డ్ ఇప్పటి వరకు ఒక్కరికి మాత్రమే సాధ్యమైంది. మరో బ్యూటీ ఆ రికార్డ్ కోసం పోటీ పడుతుంది. మరింతకీ రికార్డ్ అందుకుందెవరు.. పోటీలో ఉన్నదెవరు..? పెళ్లి తర్వాత బాలీవుడ్‌లో ఓ సౌత్ హీరోయిన్ వెళ్లి సక్సెస్ కొట్టడం అనేది అంత ఈజీ కాదు. కొన్నేళ్లలో నయనతారకు మాత్రమే ఆ రికార్డు సాధ్యమైంది. విఘ్నేష్ శివన్‌ను పెళ్లాడాక.. బాలీవుడ్ వెళ్లి అట్లీ దర్వకత్వంలో జవాన్‌లో నటించి ఏకంగా 1000 కోట్లు కొట్టారు నయన్. దెబ్బకు అమ్మడి రేంజ్ మారింది. తాజాగా సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి సినిమాలో నటిస్తున్నారు నయన్. కీర్తి సురేష్ కూడా హిందీలో వరుణ్ ధావన్‌తో బేబీ జాన్‌లో నటిస్తున్నపుడే పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయింది. మరోవైపు సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకున్న తర్వాత కియారా అద్వానీ నటించిన వార్ 2, గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అయ్యాయి. దాంతో టాక్సిక్‌పైనే ఆమె ఆశలన్నీ ఉన్నాయి. ఈ సినిమాలో యశ్‌తో కలిసి నటిస్తున్నారు ఈ బ్యూటీ. ఇప్పుడు రష్మిక మందన్న వంతు. పెళ్లికి ముందు బాలీవుడ్‌లో ఛావా, యానిమల్ అంటూ రప్ఫాడించిన రష్మిక.. ఆఫ్టర్ మ్యారేజ్ కాక్ టైల్ 2తో జూన్ 19న రానున్నారు. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో కృతి సనన్ మరో హీరోయిన్. ఈ సినిమాతో హిట్ కొట్టి.. నయన్ రికార్డ్ అందుకోవాలని చూస్తున్నారు మిసెస్ దేవరకొండ. మరి అది జరుగుతుందా లేదా అనేది చూడాలిక.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

MS Dhoni: రిటైర్మెంట్‌‌పై ధోనీ.. హింట్‌ ఇచ్చినట్లేనా?

Jayam Ravi: భార్య VS లవర్‌! దెబ్బకు పిచ్చోడిలా తయారైన స్టార్ హీరో

20లక్షల కోసం.. హీరోయిన్‌ను చంపేసిన భర్త?

పాపం! ఆ స్టార్‌ను చూస్తుంటే బాధేస్తోంది..

Peddi: అమ్మ బుచ్చి.. నీకోమో 30 కోట్లు.. హీరోకేమో 100 కోట్లా..

Follow Us