Saranga dariya: ‘ఓ మధ్యతరగతి తండ్రి కథ’ ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
సీనియర్ నటుడు రాజా రవీంద్ర లీడ్ రోల్‌లో తెరకెక్కుతున్న సినిమా సారంగదరియా. సాయిజా క్రియేషన్స్ బ్యానర్‌పై ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మిస్తున్న ఈ సినిమాతో పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజైంది. హీరో శ్రీవిష్ణు చేతుల మీదుగా రిలీజ్ అయిన ఈ టీజర్ ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది. ఎమోషనల్ అయ్యేలా చేస్తోంది. సినిమా పై అంచనాలను పెంచేస్తోంది.
సీనియర్ నటుడు రాజా రవీంద్ర లీడ్ రోల్‌లో తెరకెక్కుతున్న సినిమా సారంగదరియా. సాయిజా క్రియేషన్స్ బ్యానర్‌పై ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మిస్తున్న ఈ సినిమాతో పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజైంది. హీరో శ్రీవిష్ణు చేతుల మీదుగా రిలీజ్ అయిన ఈ టీజర్ ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది. ఎమోషనల్ అయ్యేలా చేస్తోంది. సినిమా పై అంచనాలను పెంచేస్తోంది. ఇక టీజర్ చూస్తుంటే.. సారంగదిరయా పక్కా ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. మధ్యవయస్కుడైన ఓ వ్యక్తి.. తన భార్య, ఇద్దరు కొడుకులు, కూతురితో సంసారాన్ని వెల్లదీస్తుంటాడు. సమాజంలో పరువుగా బతికితే చాలు అనుకునే వ్యక్తికి తన కొడుకులు, కూతురు వల్ల ఇబ్బందులు వస్తాయి. సమాజం అతన్ని నిలదీసే పరిస్థితులు ఎదురవుతాయి. అప్పుడు ఆ కన్నతండ్రి ఏం చేశాడు.. తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు.. అనే కథాంశంతో ‘సారంగదరియా’ తెరకెక్కినట్టు టీజర్ చూస్తే తెలుస్తోంది.
అంతేకాదు సీనియర్ నటుడు రాజా రవీంద్ర, తన కూతురు కోసం పడే తాపత్రయం టీజర్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తూ.. అందర్నీ ఎమోషనల్ అయ్యేలా చేస్తోంది. దీంతో ఈ మూవీ టీజర్ యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంటోంది. సారంగదరియా మూవీని.. మే నెలలో రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఇప్పటికే లెజెండ్రీ సింగర్ పాడిన ‘అందుకోవా..’ ఇన్‌స్పిరేషనల్ సాంగ్ తో పాటు ‘నా కన్నులే’ లిరికల్ సాంగ్స్ హిట్టయ్యాయి. వీటికి తోడు టీజర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చేలా చేసుకోవడంతో.. మూవీ టీం ఖుషీ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!