నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు.. జయం రవికి భార్య ఆర్తి కౌంటర్
Aarti Ravi చేసిన తాజా ట్వీట్ కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. తన మౌనాన్ని బలహీనతగా భావించవద్దంటూ, అవసరమైతే పిల్లల కోసం లగ్జరీ జీవితాన్ని వదిలి సాధారణ గృహిణిగా జీవించడానికి సిద్ధమని ఆమె పేర్కొన్నారు. Jayam Raviతో కొనసాగుతున్న విడాకుల వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో మరింత రసవత్తరంగా మారింది.
ఇప్పుడు జయం రవి టాపిక్ కాస్త సోషల్ మీడియాలో రసవత్తరంగా మారుతోంది. ఓ పక్క తన భార్య ఆర్తి.. తనను మానసికంగా వేధిస్తోందని జయం రవి ఆరోపిస్తుండగా.. ఆర్తి మాత్రం ఆడ సింహంతో పెట్టుకోవద్దంటూ తాజాగా రవికి వార్నింగ్ ఇచ్చింది. నిద్రపోతున్న సింహాన్ని ఎప్పుడూ లేపొద్దు. అందులోనూ ఆడసింహంతో మరింత జాగ్రత్తగా ఉండాలి. అంటూ ఆర్తి రవి తాజాగా ఓ ట్వీట్ చేసింది. అంతేకాదు అందులో తన గౌరవప్రదమైన మౌనాన్ని బలహీనతగా తీసుకోవద్దు అంటూ జయం రవిని హెచ్చరించింది.అవసరమైతే తన పిల్లలను, తన గౌరవాన్ని కాపాడుకోవడానికి తాను అనుభవిస్తున్న లగ్జరీ జీవితాన్ని త్యజించి బయటికి రావడానికి సిద్దమని తన ట్వీట్ లో కోట్ చేశారు ఆర్తి. ఓ సాధారణ గృహిణిలా.. తనను, తన పిల్లలను పోషించుకుంటూ నిజాయితీగా తాను జీవించగలను అంటూ ఆమె తన ట్వీట్‌లో రాసుకొచ్చింది. చివరగా సత్యమే గెలుస్తుంది అంటూ.. రాసుకొచ్చింది ఆర్తి. ప్రస్తుతం ఈమె చేసిన పోస్ట్ నెట్టింట వైరల అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రేమ ఒప్పుకోలేదని.. కెనెడా నుంచి వచ్చి మరీ సింగర్‌ను చంపేసిన వ్యక్తి
‘నా కాపురంలో నిప్పులు పోసింది ఈమె!’ హీరో ఆరోపణపై ఖుష్బూ రియాక్షన్
