Adipurush Tickets Free: ఏకంగా 1 లక్షా 32వేల ఆదిపురుష్ టికెట్లు.. ఫ్రీ అంటే ఫ్రీగా..!

Updated on: Jun 14, 2023 | 9:29 AM

ఆదిపురుష్ మూవీ ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. త్రూ అవుట్ ఇండియా... జై శ్రీరామ్ నామమే మరామ్రోగుతోంది. ఆ రఘురాముడిగా .. ప్రభాస్‌ రూపమే అందరికీ కనిపిస్తోంది. మహోన్నత మనిషిగా.. దేవుని రూపంగా అందరి మదిలో ముద్రైపోయింది. హైఎండ్ అడ్వాన్స్‌డ్‌ గ్రాఫిక్స్‌లో..

ఆదిపురుష్ మూవీ ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. త్రూ అవుట్ ఇండియా… జై శ్రీరామ్ నామమే మరామ్రోగుతోంది. ఆ రఘురాముడిగా .. ప్రభాస్‌ రూపమే అందరికీ కనిపిస్తోంది. మహోన్నత మనిషిగా.. దేవుని రూపంగా అందరి మదిలో ముద్రైపోయింది. హైఎండ్ అడ్వాన్స్‌డ్‌ గ్రాఫిక్స్‌లో.. మనకు తెలిసిన రామాయణ అరణ్య కాండ ఎలా ఉండబోతోందో.. చూడాలనే క్యూరియాసిటీ అందర్లో అంతకంతకూ పెరిగిపోతోంది. జూన్‌ 16 డేట్ వైపే చూసేలా చేస్తోంది. ఇక ఇంతలా అంచనాలు పెరిగిపోయిన ఈ మూవీని.. పేద పిల్లలకు.. అనాథ పిల్లలకు ఉచితంగా చూపించాలని కొందరు సెలబ్రిటీలు ముందుకు వచ్చారు. ముందుగా ప్రొడ్యూసర్‌ అభిషేక్ అగర్వాల్.. పదివేల టికెట్లను బుక్‌ చేసి అనాథ పిల్లలకు.. పేద పిల్లలకు చూపించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆదిపురుష్ మేకర్స్ నుంచి అంత మొత్తంలో టికెట్స్‌ను కూడా తాజాగా కొనేశారు. ఇక ఈయన్ను చూసిన స్టార్ హీరో రణ్‌ బీర్ కపూర్ కూడా… పది వేల టికెట్లను.. పేద, అనాథ పిల్లలకు డిస్ట్రిబ్యూట్‌ చేసేందుకు ముందుకొచ్చారు. ఇదే బాలీవుడ్ నుంచి అనయ బిర్లా కూడా పది వేల టికెట్లను ఆర్పాన్ కిడ్స్‌ కోసం ఇవ్వనున్నట్లు తాజాగా తన సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేశారు. ఇక వీరికి తోడుగా… టాలీవుడ్‌ నుంచి తాజాగా మంచు మనోజ్‌ భూమా మౌనిక రెడ్డి జోడీ కూడా ముందుకొచ్చారు. తెలుగు టూ స్టేట్స్‌లో ఉన్న అనాథ పిల్లల కోసం దాదాపు 2500 ఆదిపురుష్‌ టికెట్లను తానే స్వయంగా బుక్‌ చేసి.. డిస్ట్రిబ్యూట్ చేస్తా అంటూ.. అనౌన్స్ చేశారు. ఇక మంచు మనోజ్‌ కు తోడు.. టాలీవుడ్ ఈవెంట్ మేనిజింగ్ కంపెనీ శ్రేయాస్ మీడియా కూడా… ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. ఖమ్మం జిల్లాలోని దాదాపు అన్ని విలేజెస్‌లో ఉన్న రామాలయాలకు ఫ్రీగా 101 టికెట్లు అందించనున్నట్టు అనౌన్స్ చేశారు. అంటే అప్రాక్స్‌ లక్ష టికెట్లను ఫ్రీగా ఇవ్వనున్నారు. ఇక అఫీషియల్‌గా తెలవకపోయినప్పటికీ మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ కూడా ఆర్ఫాన్స్‌ కోసం పదివేల టికెట్స్‌ బుక్ చేసినట్టు ఇన్‌సైడ్‌ టాక్ కూడా ఉంది. ఇలా మొత్తంగా 1,32,500 ఆదిపురుష్‌ టికెట్లను.. ఆర్పాన్ కిడ్స్‌కు.. ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసేందుకు సెలబ్రిటీలు ముందుకొచ్చారు. అయితే ఇలా ఓ సినిమాకు.. సెలబ్రిటీలు ముందుకొచ్చి.. టికెట్స్‌ పంచడం.. ఇప్పుడు హిస్టరీ క్రియేట్ చేస్తోంది. మన పురాణాలను నేటి పిల్లలకు దగ్గర చేయాలనే వారి ఆలోచన.. అందరి మన్ననలను పొందుతోంది.