ఇదేం పోయేకాలం.. పెళ్లాం పిల్లల్ని వదిలేసి.. పాడు పని వీడియో
జగిత్యాల జిల్లాలో ఒక ఆశ్చర్యకర ఘటన వెలుగు చూసింది. ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన ఒక వ్యక్తి భార్య, పిల్లలను వదిలేసి ట్రాన్స్ జెండర్ తో సహజీవనం చేయడం వార్తల్లోకి ఎక్కింది. కాగా భర్త తీరుతో మానసిక వేదనకు గురైన అతని భార్య ఆత్మహత్య యత్నం చేసింది. జగిత్యాల పట్టణానికి చెందిన పింగి రాజశేఖర్ కు పెంబట్ల గ్రామానికి చెందిన లాస్యతో 2014లో వివాహమైంది.
ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కొంతకాలంగా రాజశేఖర్ హైదరాబాద్ కు చెందిన ట్రాన్స్ జెండర్ దీపు తో సన్నిహితంగా ఉంటూ వచ్చాడు. అంతేకాదు భార్యకు తెలియకుండా దీపుతో సహజీవనం ప్రారంభించాడు. ఎట్టకేలకు ఈ విషయం తెలుసుకున్న అతని భార్య లాస్య మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కాగా భార్య ఆసుపత్రిలో చేరిన భర్త రాజశేఖర్ హాస్పిటల్ కు రాకపోవడంతో ఆందోళనకు గురైన అత్తా మామలు అతడి కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో తన ఇంట్లోనే ట్రాన్స్ జెండర్ దీపుతో కలిసి ఉన్న రాజశేఖర్ ను వారు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బయట నుంచి రూమ్ కు తాళం వేసి పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రాజశేఖర్ దీపులను స్టేషన్ కు తరలించి విచారణ ప్రారంభించారు. కాగా స్థానికంగా ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని వీడియోల కోసం :