మైత్రీవనం సర్కిల్‌లో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్..

Updated on: May 28, 2026 | 8:37 PM

అమీర్‌పేట మైత్రీవనం సర్కిల్‌లో మాజీ సీఎం ఎన్.టి. రామారావు ఎన్టీఆర్‌ విగ్రహాన్ని తెలంగాణ సీఎం ఏ. రేవంత్ రెడ్డి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రులు, సినీ ప్రముఖులు, అభిమానులు భారీగా హాజరయ్యారు. .. ..

నగరంలోని అమీర్‌పేట మైత్రీవనం సర్కిల్‌లో ఏర్పాటు చేసిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ఎన్టీఆర్‌ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజహరుద్దీన్ అజహరుద్దీన్‌, పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్ గౌడ్ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ పాల్గొన్నారు. అలాగే ఎన్టీఆర్‌ కుమారులు నందమూరి రామకృష్ణ, మోహనకృష్ణతో పాటు సినీనటుడు మంచు మనోజ్ మంచు మనోజ్‌, దర్శకుడు బోయపాటి శ్రీను బోయపాటి శ్రీను హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం సందర్భంగా మైత్రీవనం సర్కిల్‌లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్థానిక ప్రజలకు, అభిమానులకు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం.. సరిగ్గా ఎన్టీఆర్ జయంతి రోజే ఆయన భారీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి తన హామీని నిలబెట్టుకున్నారు రేవంత్. తెలుగు సమాజానికి ఎన్టీఆర్ చేసిన సేవలు మర్చిపోలేనివని సీఎం రేవంత్ పేర్కొన్నారు.

Published on: May 28, 2026 08:33 PM
Follow Us