రూ. 500కే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ పథకాలకు శ్రీకారం.. అర్హతలు ఇవే..

లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్నవేళ తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ తన గ్యారంటీల అమలులో స్పీడ్‌ పెంచింది. మరో రెండు గ్యారంటీలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఉచిత కరెంట్, రూ.500 సిలిండర్‌ పథకాలను సచివాలయంలో సీఎం రేవంత్‌ ప్రారంభిస్తున్నారు. మహాలక్ష్మి పథకం కింద మరో గ్యారంటీ అమలు చేస్తున్నారు.

రూ. 500కే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ పథకాలకు శ్రీకారం.. అర్హతలు ఇవే..
2 Gurantees Congress
Follow us

|

Updated on: Feb 27, 2024 | 4:21 PM

లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్నవేళ తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ తన గ్యారంటీల అమలులో స్పీడ్‌ పెంచింది. మరో రెండు గ్యారంటీలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఉచిత కరెంట్, రూ.500 సిలిండర్‌ పథకాలను సచివాలయంలో సీఎం రేవంత్‌ ప్రారంభిస్తున్నారు. మహాలక్ష్మి పథకం కింద మరో గ్యారంటీ అమలు చేస్తున్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అమలుపై ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సబ్సిడీ సిలిండర్ల కోసం మూడు కండీషన్లు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం.

  • ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారికి సబ్సిడీ
  • తెల్లరేషన్‌కార్డును ప్రామాణికంగా పెట్టిన ప్రభుత్వం
  • మూడేళ్ల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని కేటాయింపు

ఈ పధకం కింద తెలంగాణలో 39.5 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. అలాగే తొలుత గ్యాస్ సిలిండర్‌కు మొత్తం డబ్బు చెల్లించాక సబ్సిడీ రూపంలో రూ. 500 మినహా మిగిలిన అమౌంట్ లబ్దిదారుల బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నారు. 48 గంటల్లోగా లబ్ధిదారుల అకౌంట్లలోకి ఈ సబ్సిడీ సొమ్ము పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.