ఉభయ వేదాంత పీఠంకు అనుసంధానం ఈ స్వర్ణగిరి ఆలయం: చిన్నజీయర్ స్వామి

|

Jul 05, 2024 | 7:27 PM

ఉభయ వేదాంత పీఠంకు అనుసంధానం చేసే స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు చిన్నజీయర్ స్వామి. ఈ కార్యక్రమానికి ఆయన వెంట అహోబిల రామానుజ జీయర్ స్వామి, దేవనాథ జీయర్ స్వామి విచ్చేయగా..

ఉభయ వేదాంత పీఠంకు అనుసంధానం చేసే స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు చిన్నజీయర్ స్వామి. ఈ కార్యక్రమానికి ఆయన వెంట అహోబిల రామానుజ జీయర్ స్వామి, దేవనాథ జీయర్ స్వామి విచ్చేయగా.. ఆలయ నిర్వాహకులు, ఆలయ అర్చకులు వారిని పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ నేపధ్యంలో చిన్నజీయర్ స్వామి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఉభయ వేదాంత పీఠంకు అనుసంధానం చేసే కార్యక్రమంలో పాల్గొన్నాం. అందుకోసమే మేము ముగ్గురం కలిసి రావడం జరిగింది.
స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉభయ వేదాంత పీఠంకు అనుసంధానం చేయడం జరిగింది. ఒక మంచి కార్యం కోసం దేవుడు కొందరిని ఎంచుకుంటాడు. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు ఇక్కడ వెలిశారు. వేంకటేశ్వరుడి నిత్యసేవగా ఈ ఆలయం ఉంటుంది’ అని చిన్నజీయర్ అన్నారు.

ఇది చదవండి: మీ కంటిచూపు షార్పా.? ఈ ఫోటోలో చిరుతను గుర్తిస్తే మీరే తెలివైనవారు

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..