Kailash-Manasarovar Yatra: కైలాస-మానస సరోవర్ యాత్రికులకు కేంద్రం హెచ్చరిక

Updated on: Jul 01, 2026 | 5:45 PM

కైలాస-మానస సరోవర్ యాత్రికులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. చైనా వీసా, అవసరమైన అన్ని అధికారిక అనుమతి పత్రాలు పూర్తిగా చేతికి రాకుండా ప్రయాణం ప్రారంభించవద్దని సూచించింది. ఇటీవల 52 మంది భారతీయులు నేపాల్ సరిహద్దులో చిక్కుకుపోవడంతో ఈ సూచనలు జారీ చేసింది. గుర్తింపు పొందిన టూర్ ఆపరేటర్ల ద్వారానే యాత్రకు వెళ్లాలని విదేశాంగ శాఖ సూచించింది.

కైలాస-మానస సరోవర్ యాత్రకు వెళ్లే భారతీయ యాత్రికులకు కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన హెచ్చరిక జారీ చేసింది. చైనాలోకి ప్రవేశించడానికి అవసరమైన అధికారిక వీసాలు, పర్మిట్లు పూర్తిగా చేతికి రాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్లు దాటవద్దని స్పష్టం చేసింది. ఇటీవల ప్రైవేట్ టూర్ ఆపరేటర్లను నమ్మి, సరైన పత్రాలు లేకుండా బయలుదేరిన 52 మంది భారతీయ యాత్రికులు నేపాల్ సరిహద్దుల్లో చిక్కుకుపోయారు. తమను రక్షించాలంటూ వారు అభ్యర్థించడంతో కేంద్రం ఈ మేరకు స్పందించింది. యాత్రకు సంబంధించిన అన్ని రకాల అధికారిక పత్రాలు పూర్తిగా చేతికి వచ్చే వరకు ప్రయాణాన్ని ప్రారంభించవద్దని, అనుమతి పత్రాలు లేకుండా వెళ్తే చట్టపరమైన సమస్యలు ఎదురవుతాయని హెచ్చరించింది. ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీలను ఆశ్రయించే యాత్రికులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని కోరింది. తాము ఎంచుకున్న ఆపరేటర్లకు అధికారిక గుర్తింపు, రిజిస్ట్రేషన్ ఉన్నాయో లేదో ముందే సరిచూసుకోవాలని సూచించింది. సరైన ఏర్పాట్లు లేకపోతే విదేశాల్లో ఆర్థిక నష్టాలతో పాటు చట్టపరమైన సమస్యలు, మానసిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ప్రభుత్వ సహాయక కమిటీల ద్వారా సాగే అధికారిక యాత్రలు నాథూలా పాస్ మీదుగా సాఫీగానే సాగుతున్నప్పటికీ.. ప్రైవేటు ఆపరేటర్ల నిర్లక్ష్యం వల్లే సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని కేంద్రం పేర్కొంది. కాబట్టి, మోసపూరిత ప్రకటనలు నమ్మి మోసపోకుండా, గుర్తింపు పొందిన టూర్ ఆపరేటర్లను మాత్రమే ఎంచుకోవాలని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. భద్రత ముఖ్యం.. అన్ని పత్రాలు సవ్యంగా ఉన్నప్పుడే ప్రయాణం ప్రారంభించాలని సూచించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Health Alert: న్యూస్‌ పేపర్‌లో ఫుడ్‌ పార్సిల్ ఎంత డేంజరో తెలుసా?

కూలీని వరించిన అదృష్టం.. గనిలో దొరికిన రూ.40 లక్షల విలువైన వజ్రం

స్టోర్ రూంలో వింత శబ్దాలు వెళ్లి చూసిన ఇంటి యజమాని గుండె గుభేల్‌!

Bullet Train: హైదరాబాద్ – బెంగళూరు బుల్లెట్ ట్రైన్‌ ప్రాజెక్ట్‌ పనులు షురూ!

Maharashtra: గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు

Follow Us