మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం ధర 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర 80 ఏళ్లలో..

Updated on: Aug 19, 2026 | 4:13 PM

1947లో రూ.88గా ఉన్న 10 గ్రాముల బంగారం ధర నేడు లక్షన్నరకు చేరి 1711 రెట్లు పెరిగింది. భారతీయులకు ఆభరణంగానే కాక నమ్మకమైన పెట్టుబడిగా, కష్టకాలంలో భరోసాగా బంగారం నిలుస్తుంది. ఈ 80 ఏళ్లలో బంగారం ధరలపై ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభాలు, రూపాయి విలువ వంటి ఎన్నో అంశాలు ప్రభావం చూపాయి.

బంగారం భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు. తరతరాలుగా నమ్మకమైన పెట్టుబడిగా, కష్టకాలంలో ఆదుకునే భరోసాగా దీనిని భావిస్తారు. స్వాతంత్య్రం వచ్చిన 1947లో 10 గ్రాముల బంగారం ధర కేవలం రూ.88.62 పైసలు ఉండగా, నేడు లక్షన్నర రూపాయలకు పైగా ఉంది. అంటే దాదాపు 80 ఏళ్లలో బంగారం ధర ఏకంగా 1711 రెట్లు పెరిగింది.ఈ భారీ పెరుగుదలకు ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం, రూపాయి విలువ, అంతర్జాతీయ బంగారం ధరలు, వడ్డీ రేట్లు, యుద్ధాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి అనేక అంశాలు కారణం. ముఖ్యంగా రూపాయి విలువ ప్రభావం భారత్‌లో బంగారం ధరపై అధికంగా ఉంటుంది. 1970లలో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం, చమురు సంక్షోభాలు, ఆర్థిక అనిశ్చితి వంటివి బంగారం ధర పెరగడానికి కారణమయ్యాయి. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం, 2020లో కరోనా మహమ్మారి వంటి ఘటనలు బంగారానికి సేఫ్ హెవెన్ హోదాను పెంచాయి. ప్రస్తుతం కూడా ప్రపంచవ్యాప్త అనిశ్చితి, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు ధరలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ 80 ఏళ్ల ప్రయాణం భారత ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం, ప్రపంచ పరిణామాలను ప్రతిబింబిస్తుంది.

మరిన్ని వీడియోల కోసం :

గ్లోబల్‌ బిజినెస్‌ లెక్కలు మార్చేస్తున్న రామాయణ టీమ్‌

ఫరియా అబ్దుల్లాను ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు

ఆగస్టు మీద ఐకాన్‌ స్టార్‌ ఫ్యాన్స్ ఆశలు

అజిత్ సినిమాలో గెస్ట్ రోల్స్‌లో వెంకటేష్‌, మోహన్‌లాల్‌

Published on: Aug 19, 2026 01:20 PM
Loading...
Unable to load recommendations.
Follow Us