PAN Card: అలర్ట్‌.. మారబోతున్న పాన్‌ రూల్స్‌.. ఈ సారి ఆ ప్రూఫ్ తప్పనిసరి

Updated on: Mar 24, 2026 | 4:46 PM

ప్రస్తుతం పాన్ కార్డు కీలకమైన డాక్యుమెంట్‌గా మారింది. ఏప్రిల్ 1, 2026 నుండి పాన్ కార్డు దరఖాస్తు నిబంధనలు మారుతున్నాయి. ఇకపై ఆధార్‌తో పాటు పుట్టిన తేదీ ధ్రువీకరణకు మరో డాక్యుమెంటు తప్పనిసరి. కేవలం ఆధార్‌తో దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 31, 2026 చివరి తేదీ. పాత దరఖాస్తు ఫారాలు చెల్లవు, కొత్తవి త్వరలో అందుబాటులోకి వస్తాయి.

ప్రస్తుత రోజుల్లో పాన్ కార్డు అనేది ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారిపోయింది. బ్యాంకులో డబ్బులు వేయాలన్నా, తీయాలన్నా పాన్ నంబర్ అడుగుతున్నారు. ఐటీ రిటర్నులు ఫైల్ చేసేందుకు పాన్ కార్డు తప్పనిసరి. రూ. 50 వేలకు మించి లావాదేవీలు నిర్వహించాలంటే పాన్ నంబర్ కావాలి. అందుకే ప్రస్తుతం చాలా మంది పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. మీరు కూడా కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటే మీకో అలర్ట్. వచ్చే ఏప్రిల్‌ 1, 2026 నుంచి పాన్‌కార్డ్‌కు సంబంధించి రూల్స్‌ మారుతున్నాయి. ఆధార్ కార్డుతో పాటుగా పుట్టిన తేదీ ధ్రువీకరణ కోసం మరో డాక్యుమెంటును తప్పనిసరి చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్ ఉంటే సరిపోతుంది. అయితే, ఇది మార్చి 31, 2026 తేదీ వరకే వర్తిస్తుంది. ఆ తర్వాతి రోజు నుంచి ఆధార్ తో పాటు డేట్ ఆఫ్ బర్త్ ధ్రువీకరణ కోసం మరో డాక్యుమెంట్ ఇవ్వాల్సి ఉంటుందని కామన్ సర్వీస్ సెంటర్ ఇ-గవర్నెన్స్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తెలిపింది. కేవలం ఆధార్‌తో పాన్ అప్లికేషన్ చేసేందుకు మార్చి 31 వరకే గడువు ఉందని తెలిపింది. ఏప్రిల్ 1, 2026 నుంచి అదనంగా డేట్ ఆఫ్ బర్త్ ఫ్రూఫ్ కావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అలాగే పాన్ కార్డు అప్లికేషన్ పాత ఫారాలు ఇకపై యాక్సెప్ట్ చేయరని తెలిపింది. కొత్త ఫారాలను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తారని, ఈ కొత్త మార్పులను ప్రజలు గమనించాలని సీఎస్‌సీ కోరింది. ఈ జాబితాలో బర్త్ సర్టిఫికెట్, ఓటర్ ఐడీ కార్డు, పదో తరగతి మార్కుల సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, మెజిస్ట్రేట్ వద్ద తీసుకున్న అఫిడవిట్, పాస్‌పోర్ట్ ఉన్నాయి. ఇవేమీ లేని సందర్భంలో ఇతర ఏదైనా ప్రభుత్వ డాక్యుమెంట్ అయినా ఉండాలని సీఎస్‌సీ ఇ- గవర్నెన్స్ తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డుపై పేరును తొలగిస్తున్నారని తెలిపింది. పాన్ కార్డును సూచించే పేరు ఆధార్ ప్రకారం ఉంటుందని స్పష్టం చేసింది. ఎవరైనా పాన్ కార్డు కావాలనుకుంటే మార్చి 31 వ తేదీలోపు అప్లై చేసుకోవాలని కోరింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Weather Update: వచ్చే 3 రోజులూ వానలే.. చల్ల చల్లని.. కూల్ కూల్

Gold Price Today: యుద్ధం ఎఫెక్ట్‌.. మరీ దారుణంగా పడిపోయిన బంగారం, వెండి ధరలు

సముద్రంలో ఇంటర్నెట్‌ కేబుళ్లపై యుద్ధం ప్రభావం.. మెటా ప్రాజెక్టుకు బ్రేక్ !!

అత్తాపూర్‌లో రెచ్చిపోయిన దొంగలు.. గంటల వ్యవధిలోనే..

సార్.. మీ కాళ్లు మొక్కుతా.. నన్ను పాస్ చేయండి

Follow Us