గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. సిలిండర్ పొందాలంటే.. అది తప్పనిసరి
ఎల్పీజీ సబ్సిడీ పొందే గృహ వినియోగదారులకు కేంద్రం కీలక నిబంధన తీసుకొచ్చింది. అక్టోబర్ 1, 2026 నుంచి సబ్సిడీతో కూడిన రీఫిల్ బుక్ చేసుకోవాలంటే బయోమెట్రిక్ ఆధార్ ఆథెంటికేషన్ పూర్తి చేసి ఉండాలి. ఇప్పటికే 27.43 కోట్ల మంది, అంటే 89.9 శాతం వినియోగదారులు ఈ ప్రక్రియను పూర్తి చేశారు. మిగిలిన వారు డెలివరీ సమయంలో, గ్యాస్ ఏజెన్సీలో లేదా సంబంధిత మొబైల్ యాప్ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేసుకోవచ్చు.
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన సూచన చేసింది. అక్టోబర్ 1, 2026 నుంచి సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను పొందాలంటే బయోమెట్రిక్ ఆధార్ ఆథెంటికేషన్ నిబంధనను తప్పనిసరిగా అమలు చేయనున్నట్లు వెల్లడించింది. అర్హులైన లబ్ధిదారులకే సబ్సిడీ ఫలాలు అందాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే 89.9 శాతం, అంటే సుమారు 27.43 కోట్ల కనెక్షన్లకు ఆధార్ సీడింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్లు అధికారులు తెలిపారు. వినియోగదారులు తమకు వీలైన పద్ధతిలో ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేసుకునే వెసులుబాటును చమురు సంస్థలు కల్పించాయి. గ్యాస్ డెలివరీ ఇచ్చే సమయంలో డెలివరీ బాయ్ ద్వారా గానీ, నేరుగా గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి గానీ, లేదంటే సంబంధిత మొబైల్ యాప్‌ల ద్వారా గానీ ఈ ఆథెంటికేషన్ ప్రక్రియను సులభంగా పూర్తి చేసుకోవచ్చు. అయితే, ఇప్పటికే ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్న వినియోగదారులు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని చమురు సంస్థలు స్పష్టం చేశాయి. మిగిలిన వినియోగదారులు అవాంతరాలు లేకుండా సబ్సిడీ సిలిండర్లు పొందాలంటే వెంటనే ఈ వెరిఫికేషన్‌ను పూర్తి చేసుకోవాలని కోరాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pulasa Fish: బంగారంతో పోటీపడుతున్న పులస..
సర్కారు బడిలోకి ఎంట్రీ ఇచ్చిన రోబో..ఇక టీచర్ ఉద్యోగాలనూ
వైద్యం కోసం వస్తే ప్రాణాలకే ముప్పు! పెద్దాసుపత్రిలో ఏం జరుగుతోంది?
హీరో నాని రిక్వెస్ట్.. సీఎం రేవంత్ రిప్లై! థియేటర్ విజిట్ రద్దు చేసుకున్న నాని!
దడ పుట్టిస్తున్న వాయుగుండం.. తీరంలో రాకాసి అలల బీభత్సం.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
