కొత్త కనెక్షన్లు లేవు.. రెండో సిలిండరూ ఇవ్వరు !

Updated on: Aug 05, 2026 | 7:08 PM

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలో కొత్త గ్యాస్ కనెక్షన్లు ఇవ్వకపోవడమే కాకుండా, ఉన్న వారికి రెండో సిలిండర్ కూడా మంజూరు చేయకపోవడంతో ప్రజలపై అదనపు భారం పడుతోంది. సుమారు మూడు నెలలుగా కొత్త కనెక్షన్ల పంపిణీపై అప్రకటిత నిషేధం కొనసాగుతోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలో కొత్త గ్యాస్ కనెక్షన్లు ఇవ్వకపోవడమే కాకుండా, ఉన్న వారికి రెండో సిలిండర్ కూడా మంజూరు చేయకపోవడంతో ప్రజలపై అదనపు భారం పడుతోంది. సుమారు మూడు నెలలుగా కొత్త కనెక్షన్ల పంపిణీపై అప్రకటిత నిషేధం కొనసాగుతోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలోనే కొత్త డొమెస్టిక్ కనెక్షన్లకు అనుమతి లభించడం లేదని ఎల్‌పీజీ డీలర్లు స్పష్టం చేస్తున్నారు. వంట గ్యాస్ కొరత లేదని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం కొత్త దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉండిపోతున్నాయి. నగరంలో ప్రస్తుతం ఉన్న 325 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో కొత్తగా వచ్చిన ఉద్యోగులు, విద్యార్థులు, కొత్త జంటలు గ్యాస్ కనెక్షన్ల కోసం ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. గ్యాస్ సిలిండర్ అయిపోతే కొత్తది రావడానికి వారం నుంచి పది రోజులు పడుతుండటంతో ఇండక్షన్ స్టవ్‌లు, ఎలక్ట్రిక్ కుక్కర్లపై ఆధారపడాల్సి వస్తోందని.. దీనివల్ల విద్యుత్ బిల్లుల భారం మోయలేకపోతున్నామని వినియోగదారులు వాపోతున్నారు. ముఖ్యంగా కొండాపూర్, నార్సింగి, కేపీహెచ్‌బీ, ఉప్పల్ ప్రాంతాల్లో కొత్త కనెక్షన్లకు తీవ్ర డిమాండ్ ఉంది. ఈ సమస్య ఎప్పటికి పరిష్కారమవుతుందనే అంశంపై డీలర్ల వద్ద కూడా స్పష్టత లేదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పిల్లల ప్రాణాలు తీస్తున్న అరుదైన వైరస్.. హైఅలర్ట్ ప్రకటించిన సర్కార్‌!

పైకి.. కిట్‌ కాట్‌ చాక్లెట్ ప్యాకెట్‌.. ఓపెన్‌ చేస్తే కళ్లు జిగేల్‌!

కదులుతున్న రైలు నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఏం జరిగిందో తెలుసా!

త్రిషపై.. ఉదయనిధి షాకింగ్‌ కామెంట్స్‌.. తమిళనాడులో పెను దుమారం!

నీట్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కేసుల రద్దుకు ‘సుప్రీం’ గ్రీన్ సిగ్నల్!

Loading...
Unable to load recommendations.
Follow Us