క్రికెట్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌.. ఇక నుంచి ఫ్రీ వై-ఫై ఇంటర్నెట్‌

Updated on: Apr 18, 2025 | 2:10 PM

క్రికెట్‌ అభిమానులంతా IPL ఫీవర్‌తో ఊగిపోతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌కు జియో గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జియో తన 4జీ, 5జీ నెట్‌వర్క్ ను బలోపేతం చేసింది. మ్యాచ్ హైలైట్‌లు రికార్డ్ చేయడం నుంచి వీడియో కాల్స్ చేయడం వరకు స్టేడియంలో ఉన్న అభిమానులు ఇప్పుడు జియో అత్యాధునిక మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సేవల ద్వారా వేగవంతమైన ఇంటర్నెట్‌ను పొందవచ్చు.

జియోనెట్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడానికి స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు. మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి, OTP తో నిర్ధారించిన తర్వాత, జియో నెట్ కు కనెక్ట్ అవుతారు. ప్రతి సెషన్ కస్టమర్ కు 480 నిమిషాల హై-స్పీడ్ వైఫైని యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. దేశవ్యాప్తంగా ప్రధాన క్రికెట్ స్టేడియాలలో 2,000 కంటే ఎక్కువ ప్రత్యేక సెల్‌లను ఏర్పాటు చేసి, జియో ఈ సీజన్‌లో నెట్‌వర్క్ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసింది. ఐసీసీ క్రికెట్ ఫైనల్స్ సందర్భంగా జియో ఒకే రోజులో 50 కోట్ల జీబీల డేటాను ప్రాసెస్ చేయడం ద్వారా దాని నెట్‌వర్క్ సామర్థ్యాన్ని చాటింది. అలాగే ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళా సమయంలోనూ భారీ జనసాంద్రత మధ్య కూడా జియో 5జీ సేవలు నిరాటంకంగా అందించింది. Ookla నివేదిక ప్రకారం, జియో 201.87 Mbps మీడియన్ డౌన్‌లోడ్ స్పీడ్‌ను సాధించి, ఇతర టెలికాం కంపెనీలను అధిగమించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Samantha: సమంతకు అమెజాన్ ప్రైమ్ బిగ్ ఝలక్.. అభిమానుల‌కి ఊహించని షాక్

Ram Charan: రామ్ చరణ్ ఆస్తుల విలువెంతో తెలుసా..? కార్ల లిస్టు చూస్తే మైండ్ బ్లాంక్

పవన్, చరణ్ ను.. ఎన్టీఆర్ ఫాలో అవ్వాల్సిందే