ఇరాన్ యుద్ధం.. దేశంపై గ్యాస్ బాంబ్ పడనుందా..?
ఇరాన్‌పై యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ కొరత ఏర్పడింది. భారత్‌లోనూ గ్యాస్ షార్టేజ్ భయాలున్నాయి. దీనితో కేంద్రం LPG సిలిండర్ బుకింగ్ గడువు 21 నుండి 25 రోజులకు పెంచింది. కర్ణాటకలో కమర్షియల్ గ్యాస్ నిలిపివేతతో హోటళ్లు మూతపడ్డాయి. తెలుగు రాష్ట్రాలకూ ఈ ప్రభావం రావచ్చు. ధరలు పెరిగినా, సరఫరా గ్యారెంటీ లేదు. సంక్షేమ పథకాలపైనా ప్రభావం ఉంటుంది.
ఇరాన్‌పై యుద్ధం.. ప్రపంచదేశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చాలా దేశాల్లో చమురు, గ్యాస్ కొరత ఏర్పడుతోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో చమురు, మరికొన్ని దేశాల్లో గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి. యుద్ధ ప్రభావం భారత్‌పై పడిందా? దేశంలో చమురు ధరలు పెంచే ఆలోచన లేదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది సరే. మరి గ్యాస్ పరిస్థితి ఏంటి? ఎస్.. ఇవే సంకేతాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తు్న్న యుద్ధంతో ప్రపంచదేశాల అవసరాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా చమురు, గ్యాస్ కొరత చాలా దేశాలను వేధిస్తోంది. మన దేశంలోనూ యుద్ధ ప్రభావం ఉండబోతుందా? త్వరలో గ్యాస్ షార్టేజ్ రానుందా? అనే భయాందోళనలు దేశమంతా వ్యక్తం అవుతున్నాయి. అందుకే గ్యాస్ సిలిండర్ బుకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వంటగ్యాస్ బుకింగ్ సమయం 25 రోజులకు పెంచింది. ప్రస్తుతం సిలిండర్‌కు సిలిండర్‌కు మధ్య ఉన్న బుకింగ్ గడువు 21రోజులు కాగా.. దానిని 25 రోజులకు పెంచింది. సిలిండర్లకు కొరత ఏర్పడొచ్చన్న భయాలతో కొందరు ముందస్తుగా గ్యాస్ బుక్ చేస్తున్నారు. గతంలో సగటున 55 రోజులకోసారి సిలిండర్ బుక్ చేసుకునే వాళ్లు ప్రస్తుతం 15 రోజులకే బుక్ చేస్తుండడం కేంద్ర దృష్టికి రావడంతో 21 రోజుల లాకిన్ నిబంధన తీసుకొచ్చారు. ఆ గడువును 25 రోజులకు పెంచారు. కర్నాటకలో ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు నిలిపేశారు. దీనిని నిరసిస్తూ.. కర్నాటక వ్యాప్తంగా హోటళ్లు మూసేశారు. ఇవాళ బెంగళూరులో హోటళ్లు బంద్‌కు పిలుపునిచ్చింది అక్కడి హోటల్స్ అసోసియేషన్. హోటళ్లకు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల నిలిపివేతకు నిరసనగా హోటళ్ల బంద్‌కు సిద్ధమయ్యారు. పొరుగు రాష్ట్రంలో ఈ పరిస్థితులుంటే.. రేపు మన తెలుగు రాష్ట్రాల్లోనూ గ్యాస్ కొరత ఏర్పడనుందా అంటే.. ఔననే సమాధానం వినిపిస్తోంది. రేపో, మాపో.. మన దగ్గర సైతం కమర్షియల్ సిలిండర్లకు బ్యాండ్ పడే అవకాశం ఉంది. కమర్షియల్ సిలిండర్ల సరఫరా లేటయితే ప్రధాన నగరాల్లోని హోటల్స్‌పై తీవ్ర ప్రభావం పడనుంది. ఇళ్లకు వాడే గ్యాస్‌కు ఇబ్బంది లేకుండా చూస్తామని కేంద్ర, రాష్ట్రాలు చెబుతున్నా.. గ్రౌండ్ లెవల్లో పరిస్థితులు వేరేలా ఉన్నాయి. అంతర్జాతీయంగా ఏర్పడ్డ పరిస్థితులతో.. ఇప్పటికే ఇండేన్, HP లాంటి గ్యాస్ ఏజెన్సీలు వన్ డే డెలివరీని కాస్త.. త్రీ డేస్, వన్ వీక్ చేశారు. కొన్ని చోట్ల బుకింగ్ చేసి వారం దాటినా సిలిండర్ డెలివరీ అవ్వడం లేదు. డబ్బులు కట్టి తీసుకునే సిలిండర్ల పరిస్థితే ఇలా ఉంటే.. ఏపీలో పేదలకు ఏడాదికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు. తెలంగాణలో రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నారు. గ్యాస్ కొరత కారణంగా ఫ్రీ పథకాలకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులున్నాయి. ఇప్పటికే ఇళ్లలో వినియోగించే వంటగ్యాస్ సిలిండర్‌పై కేంద్రం ఇటీవల రూ.60 పెంచింది. వాణిజ్య సిలిండర్లపై రూ.114.5 పెంచింది. ధర ఎక్కువైనా పరవాలేదు, గ్యాస్ సిలిండర్ వస్తుందా అంటే అదీ నమ్మకం లేదు. ఇరాన్‌పై యుద్ధం ఇప్పటికే భారత్ ఎక్స్‌పోర్ట్స్‌ను భారీగా దెబ్బ తీసింది. యుద్ధం ఇలాగే కొనసాగితే.. రేపు గ్యాస్ సరఫరాపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
LPG shortage: చెన్నైలో గ్యాస్ కష్టాలు.. ప్రధానికి హోటల్స్ అసోసియేషన్ల లేఖ
గ్యాస్ సంక్షోభం.. ముంబైలో 20% హోటళ్లు మూత
ఇరాన్ యుద్ధ సెగ: ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం..
Dhurandhar 2: మార్చి 19న ధురంధర్ 2 రిలీజ్ .. ఓపెనింగ్స్ మీద భారీ హైప్