Intrest Taxed: వడ్డీపై వచ్చే ఆదాయనికి ఎవరు..? ట్యాక్స్ కట్టాలో తెలుసా?

|

Mar 31, 2024 | 7:59 PM

Intrest Taxed: సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్‌డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్.. ఇలాంటి వాటిలో పెట్టుబడి పెడితే వడ్డీ ద్వారా ఆదాయం వస్తుంది. జీతం, వృత్తి లేదా వ్యాపారం నుండి వచ్చే ఆదాయంపై పన్ను విధించినట్లే, వడ్డీ ఆదాయంపై కూడా పన్ను చెల్లించాలి. అయితే , వడ్డీ ఆదాయంపై మినహాయింపు క్లెయిమ్ చేయవచ్చని మీకు తెలుసా? మీరు దానికి అర్హులు అయితే ఈ సదుపాయం పొందవచ్చు. వడ్డీ ఆదాయం విషయంలో..

Intrest Taxed: సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్‌డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్.. ఇలాంటి వాటిలో పెట్టుబడి పెడితే వడ్డీ ద్వారా ఆదాయం వస్తుంది. జీతం, వృత్తి లేదా వ్యాపారం నుండి వచ్చే ఆదాయంపై పన్ను విధించినట్లే, వడ్డీ ఆదాయంపై కూడా పన్ను చెల్లించాలి. అయితే , వడ్డీ ఆదాయంపై మినహాయింపు క్లెయిమ్ చేయవచ్చని మీకు తెలుసా? మీరు దానికి అర్హులు అయితే ఈ సదుపాయం పొందవచ్చు. వడ్డీ ఆదాయం విషయంలో సాధారణ వ్యక్తుతో పోలిస్తే.. సీనియర్ సిటిజన్లు అంటే 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి.. వడ్డీ ద్వారా వచ్చే ఆదాయంతో ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. మీ పెట్టుబడి పన్ను మినహాయింపుకు అర్హమైనది కాదా… దాని నుండి మీరు ఎంత ప్రయోజనం పొందవచ్చో చూద్దాం. దాదాపు ప్రతి వ్యక్తికీ పొదుపు ఖాతా ఉంటుంది. చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ పొదుపు ఖాతాలు ఉన్నాయి.

ఎక్కువ ఖాతాలు ఉంటే ఎక్కువ వడ్డీ వస్తుంది. దీంతో పన్ను కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80TTA ప్రకారం, ఒక వ్యక్తి బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ లో ఉంచిన డబ్బుపై వచ్చిన వడ్డీపై మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో సేవింగ్స్ అకౌంట్స్ నుంచి రూ. 10,000 వరకు వచ్చే వడ్డీపై పన్ను మినహాయింపు తీసుకోవచ్చు. మినహాయింపు పరిమితి ప్రతి సేవింగ్స్ అకౌంట్‌కు వేరుగా ఉండదు. అన్ని బ్యాంకులు, పోస్టాఫీసుల సేవింగ్స్ అకౌంట్స్ నుండి పొందిన వడ్డీ మొత్తం ఇందులో కలిపే ఉంటుంది. అయితే వడ్డీపై వచ్చే ఆదాయానికి ఎవరు ట్యాక్స్‌ కట్టాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.