రైలు ప్రయాణికులకు షాక్.. రాత్రిపూట ఛార్జింగ్‌ బంద్‌

Updated on: Nov 01, 2026 | 11:12 AM

రైలు ప్రయాణికుల భద్రత దృష్ట్యా రాత్రివేళల్లో ఛార్జింగ్‌ సాకెట్లకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయాలని రైల్వే బోర్డు ఆదేశించినట్లు సమాచారం. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ ఆంక్షలు అమలు చేయనున్నారు. పవర్‌ బ్యాంక్‌ పేలుడు ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏసీ, నాన్‌ ఏసీ కోచ్‌లలోనూ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది.

రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ షాక్ ఇచ్చింది. రైళ్లలో రాత్రి సమయాల్లో మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జ్ చేసుకునే సదుపాయానికి తాత్కాలికంగా ముగింపు పలకనున్నట్లు ప్రకటించింది. ఇకపై దేశవ్యాప్తంగా నడిచే అన్ని రైళ్లలోనూ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఛార్జింగ్ సాకెట్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని రైల్వే బోర్డు అన్ని జోన్లకు అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనను ఎలాంటి మినహాయింపులు లేకుండా కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. ఇటీవల సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలో జరిగిన ఒక ప్రమాదం కారణంగా రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణ సమయంలో రాత్రిపూట ఛార్జింగ్‌లో ఉంచిన ఒక ప్రయాణికుడి పవర్‌ బ్యాంక్ ఒక్కసారిగా పేలిపోయి దట్టమైన పొగలు అలుముకోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రాత్రి సమయాల్లో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండే సమయంలో ఇలాంటి షార్ట్ సర్క్యూట్లు లేదా బ్యాటరీ పేలుళ్లు సంభవిస్తే భారీ ప్రాణనష్టం జరిగే ప్రమాదముందని నిపుణులు హెచ్చరించారు. అంతేకాకుండా, రాత్రివేళల్లో ఛార్జింగ్ పెట్టే పరికరాల పట్ల నిర్లక్ష్యం వల్ల ఫోన్లు చోరీకి గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు. నిజానికి ఈ నిబంధన కొత్తది కాదు. 2014 జూన్‌లోనే రైల్వే బోర్డు ఇలాంటి మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే క్షేత్రస్థాయిలో అవగాహన లోపం వల్ల ఇది పూర్తిగా అమలు కాలేదు. ప్రస్తుత భద్రతా ప్రమాదాల నేపథ్యంలో రైల్వే బోర్డు దీనిని మరింత కఠినతరం చేసింది. ఏసీ కోచ్‌లతో పాటు నాన్-ఏసీ కోచ్‌లలోనూ ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయడానికి రైల్వే శాఖ సిద్ధమవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అర్ధరాత్రి ఒంటరిగా క్యాబ్‌లో యువతి ప్రయాణం.. మగాడిలా అనిపించిందంటూ పోస్ట్‌

543 రకాల ఔషధాల ధరలు భారీగా తగ్గింపు..

Loading...
Unable to load recommendations.
Follow Us