దేశంలో అందుబాటులోకి వచ్చిన కొత్తరకం పెట్రోల్

Updated on: Jun 09, 2026 | 5:59 PM

దేశంలో తొలిసారిగా ఢిల్లీలో E85 పెట్రోల్ పంపును ప్రారంభించారు. 85 శాతం ఇథనాల్, 15 శాతం పెట్రోల్ మిశ్రమంతో తయారయ్యే ఈ ఇంధనం లీటరుకు రూ.82కే లభిస్తోంది. E20, ప్రీమియం పెట్రోల్ కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉండటంతో పాటు కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడనుంది. త్వరలో దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో E85 బంకులు ఏర్పాటు చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.

దేశంలో కొత్తరకం పెట్రోల్ అందుబాటులోకి వచ్చింది. ఢిల్లీలో మొదటి E85 పెట్రోల్ పంపును కేంద్రం ప్రారంభించింది. ఢిల్లీలో CNG కంటే తక్కువగా E85 పెట్రోల్ ధర ఉంది. E85 పెట్రోల్.. లీటర్ 82 రూపాయలకు అమ్ముతున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో E20 పెట్రోల్ ధర రూ 102, ప్రీమియం పెట్రోల్ ధర రూ. 109గా ఉంది. ఢిల్లీ-NCR, ముంబై-పూణే-నాగపూర్ కారిడార్లలో 50 నుంచి 100 E85 పెట్రోల్ బంకులు అతి త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి దాదాపు 500 పెట్రోల్ బంకులు, 2027 చివరి నాటికి 5వేల బంకుల ఏర్పాటు లక్ష్యంగా కేంద్రం పెట్టుకుంది. E-85 పెట్రోల్‌ ఏ వాహనాల్లో వాడాలి, దీంతో లాభనష్టాలేంటి అనే డీటెయిల్స్.. ఢిల్లీ నుంచి మా బ్యూరో చీఫ్‌ గోపీ అందిస్తారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మూడు గుడ్లకు రూ.500! బిల్లు చూసి షాకైన గెస్ట్, వైరల్ వీడియో

ఆటో డ్రైవర్ కు UPI ద్వారా.. రూ.15,682 పంపిన ప్రయాణికుడు.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్‌!

భార్యాపిల్లలు ఇంట్లో ఉండగానే.. జేసీబీతో వచ్చి.. ఇంటిని కూల్చేసిన భర్త

ఐఫోన్‌ కావాలన్న ప్రియురాలు.. మైనర్‌ ఏం చోరీ చేసాడంటే..

ఎవరెస్ట్‌పై అద్భుతం..ఆరు రోజులు ఆహారం, ఆక్సిజన్ లేకున్నా బతికాడు!

Follow Us