వాణిజ్య సిలిండర్లపై కేంద్రం కీలక నిర్ణయం

Updated on: Mar 28, 2026 | 1:28 PM

పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో దేశంలో వాణిజ్య LPG కొరతను అధిగమించడానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమల కమర్షియల్‌ LPG కోటాను 50% నుండి 70%కి పెంచింది. స్టీల్, ఆటోమొబైల్, టెక్స్‌టైల్ వంటి రంగాలకు ప్రాధాన్యతనిస్తుంది. అదనపు కోటాకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల వద్ద నమోదు, PNGకి దరఖాస్తు తప్పనిసరి. ఇరాన్ అనుమతితో హర్మూజ్ జలసంధి గుండా LPG నౌకలు ప్రయాణించనున్నాయి, త్వరలో సరఫరా సాధారణ స్థితికి.

పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం దేశంలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ సరఫరాపై పడింది. అంతర్జాతీయంగా నెలకొన్న ఇంధన సంక్షోభం దృష్ట్యా దేశీయ పరిశ్రమలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ యుద్ధం కారణంగా తలెత్తిన గ్యాస్ కొరతను అధిగమించేందుకు, వాణిజ్య మరియు పారిశ్రామిక ఎల్పీజీ (LPG) వినియోగదారుల కోటాను 50 శాతం నుండి 70 శాతానికి పెంచుతున్నట్లు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దిగుమతులకు అంతరాయం కలగడంతో ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదంలో ఉన్న రంగాలకు ఈ నిర్ణయం ప్రాణవాయువులా మారనుంది. ముఖ్యంగా ఉక్కు , ఆటోమొబైల్, టెక్స్‌టైల్, రసాయనాలు, ప్లాస్టిక్స్ వంటి అధిక మంది కార్మికులు పనిచేసే రంగాలకు ప్రభుత్వం అదనపు కోటాలో ప్రాధాన్యత ఇవ్వనుంది. ప్రస్తుతం అందుతున్న 50 శాతం సరఫరాకు తోడు, అదనంగా మరో 20 శాతం గ్యాస్‌ను సరఫరా చేయనున్నారు. అయితే, ఈ అదనపు 20 శాతం కోటా పొందాలంటే వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులు తప్పనిసరిగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల వద్ద నమోదు చేసుకోవడంతో పాటు తమ నగరాల్లోని సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థల వద్ద పైప్డ్ నేచురల్ గ్యాస్ కోసం దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. ప్రత్యేక ఉష్ణప్రయోజనాల కోసం ఎల్పీజీని వాడే పరిశ్రమలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుందని కూడా ఉత్తర్వుల్లో వివరించారు. సిలిండర్ల పంపిణీ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు చూసుకుంటాయని తెలిపింది. మరోవైపు, అంతర్జాతీయంగా ఊరటనిచ్చే పరిణామం చోటుచేసుకుంది. హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే భారతీయ ఎల్పీజీ నౌకలకు అనుమతి ఇచ్చేందుకు ఇరాన్ సానుకూలత వ్యక్తం చేసింది. భారత అధికారులు జరిపిన చర్చలు ఫలించడంతో, త్వరలోనే గ్యాస్ సరఫరా సాధారణ స్థితికి చేరుకుంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వాహనదారులకు బంపర్ ఆఫర్..తగ్గనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

ఏప్రిల్ 1 నుండి మారనున్న కొత్త రూల్స్ ఇవే

సీతమ్మ కల్యాణానికి ‘పాలకోవ’ సారె

అయోధ్యలో అద్భుతం.. రాముడికి తిలకం దిద్దిన సూర్యుడు

ఫోన్ పాస్‌వర్డ్ చెప్పాల్సిందే.. కొత్త చట్టంపై దుమారం

Follow Us