పసిడి ధర పైపైకి..ఇవాళ తులం గోల్డ్ ధర ఎంత పెరిగిందంటే!
అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. ఆగస్టు 17న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.530 పెరిగి రూ.1,55,660కు చేరింది. 22 క్యారెట్ల బంగారం రూ.500 పెరిగి రూ.1,42,700 పలుకుతోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. వెండి కేజీ ధర రూ.2,55,000 వద్ద స్థిరంగా ఉంది. భౌగోళిక ఉద్రిక్తతలు, డాలర్ కదలికలు, గ్లోబల్ మార్కెట్ ప్రభావం పసిడి ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి.
అంతర్జాతీయంగా నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల మధ్య బంగారం ధరలు రోజురోజుకీ పైకి ఎగబాకుతున్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లో బాండ్ ఈల్డ్స్ మారడం వల్ల ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడి సాధనంగా పసిడి వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో పసిడి ధరకు రెక్కలు వచ్చాయి. దీంతో పాటుగా డాలర్ మారకం విలువలో కదలికలు, గ్లోబల్ మార్కెట్ల ప్రభావం కూడా ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలిచింది. ముందుముందు వివాహాల సీజన్ ఉండటంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న అంచనాల మధ్య కొనుగోలుదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పసిడి ప్రియులు కొనుగోలు చేసే ముందు స్థానిక వ్యాపారుల వద్ద తాజా రేట్లను సరిచూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కాగా ఆగస్టు 17 సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.530 లు పెరిగి రూ. 1,55,660 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 500 పెరిగి రూ. 1,42,700 చేరింది. ఇక కేజీ రూ.2,55,000లతో వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. ఆగస్టు 17 సోమవారం దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు పరిశీలిస్తే.. ఢిల్లీలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ.1,55,810 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,42,850 పలుకుతోంది. ముంబై, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ.1,55,660 లు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,700 పలుకుతోంది. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,55,660 , అలాగే 22 క్యారట్ల బంగారం ధర రూ.1,42,700 దగ్గర ట్రేడ్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,660 లు, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,700 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.2,55,000 గా కొనసాగుతోంది. ఈ ధరలు పెరగవచ్చు.. తగ్గవచ్చు.. బంగారం కొనడానికి వెళ్లే ముందు ధరలు మరోసారి చెక్ చేసుకొని వెళితే మంచిది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇంట్లో చోరీకి వచ్చి ఆ దొంగ చేసిన పనికి.. నవ్వకుండా ఉండలేరు!
రోడ్డు పై పులి ప్రత్యక్షం.. సెల్ఫీల కోసం ఎగబడిన జనం
హాస్టల్‌లో దెయ్యం..! భయంతో ఖాళీ చేసి వెళ్లిపోయిన విద్యార్ధినిలు
