Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి!

|

Mar 23, 2024 | 12:45 PM

మీరు ఏదైనా బ్యాంక్ లేదా NBFC నుంచి గోల్డ్ లోన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు, వారు చేసే మొదటి పని మీ బంగారం ధరను నిర్ణయించడం. RBI నిబంధనల ప్రకారం, బ్యాంకులు, NBFCలు బంగారం విలువలో 75 శాతం వరకు మాత్రమే రుణాలు ఇవ్వగలవు. రుణం ఇచ్చే సమయంలో ఐఐఎఫ్‌ఎల్ బంగారం ధరను తక్కువగా అంచనా వేసి, తక్కువ రుణం ఇచ్చినట్లు వెలుగులోకి వచ్చింది. వినియోగదారుడు..

మీరు ఏదైనా బ్యాంక్ లేదా NBFC నుంచి గోల్డ్ లోన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు, వారు చేసే మొదటి పని మీ బంగారం ధరను నిర్ణయించడం. RBI నిబంధనల ప్రకారం, బ్యాంకులు, NBFCలు బంగారం విలువలో 75 శాతం వరకు మాత్రమే రుణాలు ఇవ్వగలవు. రుణం ఇచ్చే సమయంలో ఐఐఎఫ్‌ఎల్ బంగారం ధరను తక్కువగా అంచనా వేసి, తక్కువ రుణం ఇచ్చినట్లు వెలుగులోకి వచ్చింది. వినియోగదారుడు రుణాన్ని తిరిగి చెల్లించలేకపోతే, ఆ బంగారాన్ని వేలం వేయడం ద్వారా కంపెనీ ఆ బంగారం వాస్తవ ధరను పొందింది.

అందుకే గోల్డ్ లోన్ తీసుకునే ముందు, మీ బంగారం విలువను వేరే కంపెనీ దగ్గర కూడా అంచనా వేయించండి. ఈ రోజుల్లో తనిష్క్ , కళ్యాణ్ జ్యువెలర్స్ వంటి అనేక సంస్థలు బంగారం ధరకు సంబంధించిన సర్వీసులను ఉచితంగానే అందిస్తున్నాయి. రశీదు కూడా ఇస్తున్నాయి. ఏదైనా ఫైనాన్స్ కంపెనీ మీ బంగారం విలువను తక్కువగా అంచనా వేస్తున్నట్లయితే ముందు మీరు అలెర్ట్ అవ్వండి. కంపెనీ ఉద్దేశాలు సరిగా లేవని అర్థం చేసుకోండి. మీరు అటువంటి కంపెనీ నుండి రుణం తీసుకుంటే, అది వడ్డీ , పెనాల్టీ పరంగా మిమ్మల్ని మోసం చేసే ఛాన్స్ ఉంది. అయితే గోల్డ్‌లోన్‌ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం.

Follow us on