భారీగా పెరిగిన బంగారం ధర, ఇవాళ తులం ఎంత ఉందంటే?

Updated on: Jan 29, 2026 | 12:46 PM

కొత్త ఏడాదిలో బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. జనవరి 24న 24 క్యారెట్ల బంగారం రూ.3,220 పెరిగి రూ.1,65,170కి చేరగా, వెండి కిలో రూ.13,000 పెరిగి రూ.4 లక్షలకు చేరుకుంది. అంతర్జాతీయ పరిణామాలు, ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు ధరల పెరుగుదలకు కారణం. నిపుణులు రాబోయే రోజుల్లో మరింత పెరుగుదల అంచనా వేస్తున్నారు.

కొత్త ఏడాది ప్రారంభం నుంచే బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. జనవరి 2024 నెలలోనే బంగారం ధరలు దాదాపు 20 శాతం వరకు పెరిగినట్లు నిపుణులు వెల్లడించారు. అంతర్జాతీయ పరిణామాలు, దేశీయ బులియన్ మార్కెట్‌పై ప్రభావం కొనసాగితే రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా టారిఫ్ యుద్ధాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో బంగారంపై ఈ ప్రభావం పడుతోంది. మార్కెట్లు ప్రస్తుతం ఫెడరల్ రిజర్వ్ రాబోయే సమావేశంపై దృష్టి సారించాయి. ముఖ్యంగా మార్చి నెలలో వడ్డీ రేట్ల తగ్గింపుపై ఫెడ్ తీసుకునే నిర్ణయం బంగారం ధరల దిశను నిర్ణయించే కీలక అంశంగా మారనుంది.

మరిన్ని వీడియోల కోసం :

టోల్‌గేట్‌ వద్ద గుట్టు గుట్టలుగా నోట్ల కట్టలు!

స్థిరంగా బంగారం ధరలు.. బడ్జెట్‌ తర్వాత తగ్గే ఛాన్స్‌?

ఏడేళ్లుగా రైల్వేపై విద్యార్థిని పోరాటం..చివరకు..

చిరు వ్యాపారులకు అమెజాన్‌ బిగ్‌ ఆఫర్‌