Delhi New EV Policy 2026: ఢిల్లీలో కొత్త ఈవీ పాలసీ

Updated on: Apr 12, 2026 | 9:14 PM

ఢిల్లీ కాలుష్యాన్ని నివారించే లక్ష్యంతో నూతన ఈవీ పాలసీ 2026-30ని ప్రవేశపెట్టింది. 2027 జనవరి 1 నుండి ఎలక్ట్రిక్ త్రీ వీలర్ల రిజిస్ట్రేషన్ మాత్రమే అనుమతిస్తారు, ఆపై టూ వీలర్లను చేరుస్తారు. పెట్రోల్, డీజిల్ వాహనాలను తగ్గించడం, ఎలక్ట్రిక్ వాహన కొనుగోళ్లకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించడం ఈ పాలసీ ప్రధాన ఉద్దేశ్యం.

ఢిల్లీలో కాలుష్య సమస్యను పరిష్కరించేందుకు, వాహనాల ఉద్గారాలను తగ్గించేందుకు ప్రభుత్వం కొత్త ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) పాలసీని ప్రకటించింది. “ఎలక్ట్రికల్ వెహికల్ ముసాయిదా పాలసీ 2026-30” పేరుతో విడుదలైన ఈ విధానం ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పాలసీ ప్రకారం, 2027 జనవరి 1 నుండి ఎలక్ట్రిక్ త్రీ వీలర్ల రిజిస్ట్రేషన్లకు మాత్రమే అనుమతి ఉంటుంది. తదనంతరం, ఎలక్ట్రిక్ టూ వీలర్లను కూడా ఈ జాబితాలోకి చేరుస్తారు. 2028 ఏప్రిల్ 1 నుండి, అన్ని రకాల వాహనాల రిజిస్ట్రేషన్లలో ఎలక్ట్రిక్ మోడల్స్ కు మాత్రమే అనుమతి ఇవ్వబడుతుంది. పెట్రోల్, డీజిల్ వాహనాలను క్రమంగా తగ్గించి, కాలుష్య రహిత రవాణా వ్యవస్థను రూపొందించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశ్యం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్‌ టవర్లనే..

ఆటోలో 4.5 లక్షల నగలు మర్చిపోయిన మహిళ.. చివరికి..

అనారోగ్యం పాలైన భర్త.. బైక్‌ మెకానిక్‌గా మారిన భార్య

రోజూ నందీశ్వరుడికి ప్రదక్షిణలు చేస్తున్న నాగుపాము

Jailer 2: జైలర్‌2 లో పవన్‌.. ఇంతకీ నిజమేనా ??

వరికోత కోస్తున్న కూలీలు..దుబ్బుల మాటున ఉన్నది చూసి హడల్‌

Follow Us