లాకర్‌లోని బంగారానికి బ్యాంక్ గ్యారంటీ ఇస్తుందా ??

Updated on: Mar 18, 2026 | 7:56 PM

బ్యాంక్ లాకర్లలోని వస్తువులకు ఆటోమేటిక్‌గా ఇన్సూరెన్స్ ఉండదు. బ్యాంకు నిర్లక్ష్యం వల్ల నష్టం జరిగితే, వార్షిక అద్దెకు 100 రెట్లు మాత్రమే పరిహారం లభిస్తుంది. పూర్తి రక్షణ కోసం 'జ్యువెలరీ ఇన్సూరెన్స్' లేదా 'వాల్యూబుల్ ఐటమ్స్ ఇన్సూరెన్స్' తీసుకోవడం తప్పనిసరి. పాలసీ నిబంధనలు, ప్రీమియం వివరాలు తెలుసుకుని, కొనుగోలు రశీదులను భద్రపరుచుకోవాలి.

భారతీయులు చాలామంది తమ బంగారం, విలువైన వస్తువులు, భూమి పత్రాలను దాచుకోవడానికి బ్యాంక్ లాకర్లనే అత్యంత సురక్షితమైన ప్రదేశంగా భావిస్తారు. అయితే, ఈ స్టీల్ వాల్ట్‌లలో మనం దాచుకునే వస్తువులకు బ్యాంకులు ఆటోమేటిక్‌గా ఎలాంటి ఇన్సూరెన్స్ కల్పించవు. ఈ విషయం చాలా మందికి తెలియదు. బ్యాంకులు కేవలం లాకర్ స్థలాన్ని మాత్రమే అద్దెకు ఇస్తాయి తప్ప, లోపల ఉన్న వస్తువుల విలువకు అవి బాధ్యత వహించవు. సాధారణంగా బ్యాంకు నిర్లక్ష్యం వల్ల అంటే.. దొంగతనం, అగ్నిప్రమాదం లేదా సిబ్బంది మోసం వంటి సందర్భాల్లో మాత్రమే బ్యాంకు పరిహారం చెల్లిస్తుంది. కానీ, ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం ఈ పరిహారం చాలా స్వల్పంగా ఉంటుంది. మీరు చెల్లించే వార్షిక లాకర్ అద్దెకు కేవలం 100 రెట్లు మాత్రమే బ్యాంకు గరిష్ఠంగా చెల్లిస్తుంది. ఉదాహరణకు, మీరు ఏడాదికి 3,000 రూపాయల అద్దె చెల్లిస్తుంటే, మీ లాకర్‌లో 50 లక్షల విలువైన సొత్తు పోయినా, బ్యాంకు నుంచి మీకు వచ్చే గరిష్ఠ పరిహారం కేవలం 3 లక్షల రూపాయలు మాత్రమే. లాకర్‌లోని వస్తువులకు పూర్తి రక్షణ కావాలంటే విడిగా ‘జ్యువెలరీ ఇన్సూరెన్స్’ లేదా ‘వాల్యూబుల్ ఐటమ్స్ ఇన్సూరెన్స్’ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పాలసీల కోసం ఏడాదికి వస్తువు విలువలో 0.5% నుండి 1% వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పాలసీ తీసుకునేటప్పుడు నిబంధనలను జాగ్రత్తగా చదవాలి. వస్తువు విలువను నిర్ధారించే కొనుగోలు రశీదులు లేదా గుర్తింపు పొందిన జ్యువెలర్ నుంచి వాల్యుయేషన్ సర్టిఫికేట్ వంటివి భద్రపరుచుకోవాలని చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జాతి వైరం మరిచి.. తల్లి ప్రేమను పంచి.. మానవత్వానికి మూగజీవాల పాఠం

రెచ్చిపోయిన రోడ్‌సైడ్‌ రోమియోలు..

దేవుడు నాకిలా రాసిపెట్టాడేమో.. పవన్ ఎమోషనల్ వీడియో..

చివరికి గట్టెలపొయ్యే గతైంది !! నాగ శౌర్య తల్లి హోటల్ పరిస్థితి ఇది

Ram Charan: ముగ్గురు రిజెక్ట్ చేస్తే కానీ.. చరణ్‌ దగ్గరకు రాలేదు

Follow Us