Bank Loan: బ్యాంకు నుంచి రుణం తీసుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసా!

|

Feb 04, 2024 | 6:32 PM

రుణం తీసుకోవాలని అనుకున్నప్పుడు మీ తిరిగి చెల్లించే సామర్థ్యం గురించి పూర్తి అంచనా వేసుకోవాలి. మీ ప్రస్తుత ఆదాయం, స్థిరంగా ఉండే ఖర్చులు, బాధ్యతల ఆధారంగా రుణ వాయిదాల్ని చెల్లించే శక్తిని అంచనా వేయొచ్చు. సాధారణంగా నికర ఆదాయంలో ఖర్చులు దాదాపు 40-50 శాతం వరకూ ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు రుణదాతలు మీ దరఖాస్తును వేగంగా ఆమోదించే అవకాశాలున్నాయి.

ఆర్థిక అత్యవసరాల్లో అప్పు తీసుకోవడం సర్వసాధారణం. ఇల్లు, కారు, వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది రుణాలు తీసుకుంటారు. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు తేలిగ్గానే అప్పు లభిస్తున్నప్పటికీ కాస్త జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. కొన్ని విషయాలను ముందుగా తెలుసుకున్నాకే రుణం తీసుకునేందుకు ముందడుగు వేయాలి. బ్యాంకు నుంచి రుణం తీసుకునే ముందు చాలా విషయాలను పరిగణలోకి తీసుకుంటుంది బ్యాంకు. రుణం తీసుకోవాలని అనుకున్నప్పుడు మీ తిరిగి చెల్లించే సామర్థ్యం గురించి పూర్తి అంచనా వేసుకోవాలి. అన్ని వివరాలు పరిశీలించి, అప్పు తీసుకునే వ్యక్తి చెల్లించే సామర్థ్యం ఉంటుందనే బ్యాంకుకు అనిపించినప్పుడు లోన్‌ ఇచ్చేందుకు అంగీకరిస్తుంది. మరి బ్యాంకుల్లో అప్పు తీసుకోవాలంటే ఎలాంటి విషయాలపై దృష్టి సారించాలి? సులభంగా బ్యాంకు నుంచి రుణం పొందాలంటే ఏం చేయాలి..? తదితర విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.