Telangana: వరినాట్లు వేయడానికి వచ్చి బిత్తరపోయిన రైతు.. ఎదురుగా కనిపించింది చూడగా

|

Dec 18, 2024 | 5:53 PM

పొలంలో వరినాట్లు వేసేందుకు వచ్చాడొక రైతు. ముందుగా పొలానికి నీరు పెట్టి.. ఆ తర్వాత వరినాట్లు వేయడానికి సిద్దమయ్యాడు. కట్ చేస్తే.. అతడికి ఎదురుగా కనిపించిన సీన్ చూసి కళ్లు తేలేశాడు. ఈ ఘటన తెలంగాణలోని జనగాం జిల్లాలో చోటు చేసుకుంది. అసలు ఇంతకీ ఆ పొలంలో ఏం బయటపడింది.? రైతు ఏం చూసి షాక్ అయ్యాడో ఇప్పుడు తెలుసుకుందామా..

జనగామ జిల్లా కోసకండ్ల మండలంలో కలకలం రేగింది. పంట పొలంలో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు నిర్వహించి తవ్వకాలు జరిపారు. వరి నాటుకు సిద్దంగా వున్న పొలం మధ్యలో బలిచ్చి పూడ్చిన ఆనవాళ్లు గుర్తించారు రైతులు. ఈ ఘటన కొడకండ్ల మండలం మైదం చెరువు తండాలోని జాటోత్ సీతారాంనాయక్ అనే రైతు పొలంలో చోటు చేసుకుంది. క్షుద్రపూజలు జరిపి జంతు బలిచ్చరానే భయంతో హడలెత్తిపోయారు స్థానికులు. దీనితో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనాస్థలం వద్దకు చేరుకొని తవ్వకాలు జరపగా.. అందులో మొట్టు బయటపడటంతో అవాక్కయ్యారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి