Dharmapuri Arvind: ‘కాంగ్రెస్‌కి ఓటేస్తే.. తెలంగాణను తెలుగుదేశం చేతిలో పెట్టినట్లే’: బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్..

|

Nov 25, 2023 | 6:59 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ మేలంటూ చురకలంటించారు. కేసీఆర్ తెలంగాణ కోసం పోరాటం చేస్తే రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో ఉన్నారన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించారన్నారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు నాయుడు చెప్పినట్లు ఆటుతున్నారని కీలక ఆరోపణలు చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ మేలంటూ చురకలంటించారు. కేసీఆర్ తెలంగాణ కోసం పోరాటం చేస్తే రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో ఉన్నారన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించారన్నారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు నాయుడు చెప్పినట్లు ఆడుతున్నారని కీలక ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తెలంగాణను తీసుకుపోయి తెలుగుదేశం చేతిలో పెట్టినట్లే అని ఘాటైన విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డికి ఓటు వేస్తే హోల్ సేల్‌గా మిమ్మల్ని అమ్మేస్తారంటూ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. నోటుకు ఓటు కేసును తెరపైకి తీసుకొచ్చారు ధర్మపురి అర్వింద్. ఈ కేసులో రేవంత్ రెడ్డిని కేసీఆరే కాపాడుతున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీతో జాగ్రత్తగా ఉండండంటూ ప్రజలను హెచ్చరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Nov 25, 2023 06:58 PM