మీ మొబైల్‌కు ఇలాంటి మెసేజ్ వస్తే వెంటనే డిలీట్ చేయండి! ఇదో కొత్త సైబర్ దోపిడీ..

Updated on: Nov 23, 2026 | 7:14 AM

మీ మొబైల్‌కు "ట్రాఫిక్ చలాన్ పడింది, వెంటనే చెల్లించండి" అంటూ నకిలీ ఎస్ఎంఎస్ వస్తే జాగ్రత్త! అందులోని లింక్‌ క్లిక్ చేస్తే మీ ఫోన్‌లోకి నకిలీ ఎం పరివాహన్ ఏపీకే డౌన్‌లోడ్ అవుతుంది. దీనివల్ల మీ వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు సైబర్ దొంగల చేతిలోకి వెళ్లిపోతాయి. హైదరాబాద్ పోలీసులు ఈ కొత్త సైబర్ మోసంపై హెచ్చరిస్తున్నారు. అప్రమత్తంగా ఉండటం, అనుమానాస్పద యాప్‌లను ఇన్‌స్టాల్ చేయకపోవడం ముఖ్యం.

మీ మొబైల్‌కు ట్రాఫిక్ చలాన్‌కు సంబంధించిన మెసేజ్‌లు వస్తున్నాయా? “మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడింది, వెంటనే చెల్లించండి, అధికారిక ప్రభుత్వ లింక్” అంటూ ఎస్ఎంఎస్ వచ్చిందా? అయితే జాగ్రత్త! ఇదో కొత్త సైబర్ దోపిడీ అని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు సాధారణ మొబైల్ నంబర్ల నుండి వేలాది మందికి ఇలాంటి నకిలీ సందేశాలను పంపుతున్నారు. ఈ లింక్‌ను క్లిక్ చేస్తే మీ ఫోన్‌లోకి ఎం పరివాహన్ పేరుతో నకిలీ ఏపీకే ఫైల్ డౌన్‌లోడ్ అవుతుంది. ఈ నకిలీ యాప్ అచ్చం అధికారిక ఎం పరివాహన్ యాప్‌లాగే కనిపిస్తుంది. ఒక్కసారి దీన్ని ఇన్‌స్టాల్ చేస్తే, మీ ఫోన్ రిమోట్‌గా సైబర్ దొంగల నియంత్రణలోకి వెళ్తుంది. మీ బ్యాంక్ వివరాలు, ఓటీపీలు, వ్యక్తిగత సమాచారం క్షణాల్లో చోరీ అయ్యే ప్రమాదం ఉంది. ఈ మోసం వెలుగులోకి రావడంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏ ప్రభుత్వ విభాగమైనా, ట్రాఫిక్ పోలీసులైనా వ్యక్తిగత నంబర్ల నుండి చలాన్ లింకులను పంపరని గుర్తుంచుకోండి. ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే ఏ లింక్ నుండి ఏపీకే ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేయవద్దు. యాప్‌లను కేవలం గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచే డౌన్‌లోడ్ చేసుకోండి. మీ అప్రమత్తతే మిమ్మల్ని ఈ మోసాల నుండి కాపాడుతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏపీలో కోటికి పైగా బీపీ, షుగర్ కేసులు.. 3 జిల్లాల్లో పరిస్థితి దారుణం

Loading...
Unable to load recommendations.
Follow Us