ప్రమాదంలో స్కై డైవర్‌ విమానం తోక‌ను చుట్టిన పారాచూట్‌ వీడియో

Updated on: Dec 14, 2025 | 2:56 PM

ఆస్ట్రేలియాలోని క్విన్‌లాండ్స్‌లో స్కైడైవింగ్ స్టంట్ చేస్తున్నప్పుడు ఊహించని సంఘటన జరిగింది. 15,000 అడుగుల ఎత్తు నుంచి దూకిన ఓ స్కైడైవర్ పారాచూట్ విమానం తోక భాగానికి చుట్టుకుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ స్కైడైవర్ తన బ్యాకప్ పారాచూట్‌ను ఉపయోగించి, మెయిన్ పారాచూట్ తీగలను కట్ చేసి సురక్షితంగా బయటపడ్డాడు.

ఆస్ట్రేలియాలోని క్విన్‌లాండ్స్‌లో 16 మంది స్కైడైవర్‌లు పారాచూట్‌తో స్టంట్ చేసేందుకు సిద్ధమయ్యారు. 15,000 అడుగుల ఎత్తుకు విమానంలో చేరుకున్న తర్వాత, వారు ఒక్కొక్కరుగా కిందకు దూకారు. ఈ స్కైడైవింగ్ స్టంట్‌లో మరికొద్ది క్షణాల్లో వారంతా చేతులు పట్టుకుని విన్యాసం చేయాల్సి ఉంది. అయితే, ఈ సమయంలో ఊహించని ప్రమాదం జరిగింది. విమానం నుంచి జంప్ చేస్తుండగా, ఓ స్కైడైవర్ పారాచూట్ విమానం తోక భాగాన్ని చుట్టుకుంది. దాంతో, ఆ స్కైడైవర్ విమానం తోక భాగంలో వేలాడుతూ తీవ్ర భయాందోళనకు గురయ్యాడు.