సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
నిజామాబాద్ జిల్లాలోని అంకోల్ క్యాంపు గ్రామం సౌర విద్యుత్ వినియోగంలో ఆదర్శంగా నిలుస్తోంది. 2022లో ఇళ్లపై, గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన 14 సోలార్ ప్లాంట్లు ఏడాదికి 30,037 యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. గృహ అవసరాలు తీరిన తర్వాత మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేస్తూ గ్రామస్థులు ఆదాయం పొందుతున్నారు. TSREDCO సబ్సిడీ, స్త్రీనిధి రుణాలు ఈ మార్పుకు తోడ్పడ్డాయి.
ఒకప్పుడు నెలాఖరు వచ్చిందంటే కరెంట్ బిల్లు ఎంత వస్తుందో అని ఆందోళన చెందిన ఆ ఊరి ప్రజలు, ఇప్పుడు కరెంట్ బిల్లులు కట్టడమే కాకుండా.. తామే విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ మిగులు విద్యుత్‌ను అమ్మి ఆదాయం పొందుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోని ‘అంకోల్ క్యాంపు’ గ్రామం నేడు సౌర విద్యుత్ విప్లవానికి నిదర్శనంగా నిలిచి ఇతర పల్లెలకు ఆదర్శంగా మారింది. 2022లో ఈ గ్రామంలోని గ్రామ పంచాయతీతో పాటు ఇంటింటికీ సోలార్ పవర్ యూనిట్లను ఏర్పాటు చేశారు. ఉచితంగా లభించే సూర్యరశ్మినే ప్రధాన విద్యుత్ వనరుగా మార్చుకుంటూ, సంప్రదాయ విద్యుత్‌పై ఆధారపడటాన్ని గ్రామం తగ్గించుకుంది. టీఎస్ రెడ్‌కో అందించిన సబ్సిడీ, స్త్రీనిధి రుణాల సహకారంతో నిరుపేద, సామాన్య కుటుంబాలు కూడా తమ ఇళ్లపై సోలార్ ప్లాంట్లను సులభంగా ఏర్పాటు చేసుకోగలిగాయి. గ్రామంలో ఏర్పాటు చేసిన 14 సోలార్ ప్లాంట్లు కలిపి సంవత్సరానికి ఏకంగా 30,037 యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. తమ గృహ అవసరాలకు పోను మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేస్తూ గ్రామస్థులు లాభాలు పొందుతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం, ప్రజల భాగస్వామ్యం ఒకటైతే పల్లెలు కూడా ఇంధన రంగాన స్వయం సమృద్ధి సాధించగలవని అంకోల్ క్యాంపు ప్రజలు నిరూపించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పక్షవాతం అన్నాడు… ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్ కోహ్లీ..
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
