ఆడుకుందామని గ్రౌండ్‌కి వెళ్లారు..అక్కడి కనిపించింది చూసి షాక్ వీడియో

Updated on: Jul 02, 2025 | 9:30 PM

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువులో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గీతా మందిరం సమీపంలోని గ్రౌండ్ లో నిమ్మకాయలు, కూడిగుడ్లు, బూడిద వంటి వస్తువులతో పూజలు నిర్వహించిన ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఈ గ్రౌండ్ యువత, చిన్న పిల్లలు నిత్యం క్రీడలాడుకునే ప్రదేశం కావడంతో ఇలాంటి ఘటనలు ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువులో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గీతా మందిరం సమీపంలోని గ్రౌండ్ లో నిమ్మకాయలు, కూడిగుడ్లు, బూడిద వంటి వస్తువులతో పూజలు నిర్వహించిన ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఈ గ్రౌండ్ యువత, చిన్న పిల్లలు నిత్యం క్రీడలాడుకునే ప్రదేశం కావడంతో ఇలాంటి ఘటనలు ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. అంతేకాక స్థానిక బస్టాండ్ వద్ద సెల్ ఫోన్ దుకాణం వద్ద కూడా అక్షింతలు, ఎండుమిరపకాయలు, నిమ్మకాయలను పడేయడంతో దుకాణ యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. వరుస ఘటనలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. క్షుద్ర పూజల వెనుక ఎవరున్నారనే దానిపై ధర్యాప్తు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రజలు తమ సందేహాలను వెల్లడిస్తూ పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. స్పేస్ లో అద్భుతాలు చేస్తున్న ప్రస్తుత సమయంలో ఇలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని జనవిజ్ఞాన వేదిక వాళ్ళు తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us