వయసు దాటిన ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..ఇక.. 44 ఏళ్లొచ్చినా సర్కార్ నౌకరీకి అర్హులే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. నాన్-యూనిఫామ్ ప్రభుత్వ ఉద్యోగాల గరిష్ట వయోపరిమితిని 34 నుంచి 44 ఏళ్లకు పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సడలింపు 2027 సెప్టెంబర్ 30 వరకు వర్తిస్తుంది. రిజర్వేషన్ వర్గాలకు అదనపు ప్రయోజనం లభించనుంది. కొన్ని రకాల ఉద్యోగాలకు ఇది వర్తించదు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త అందించింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మందికి లబ్ధి చేకూర్చేలా నాన్-యూనిఫామ్ ప్రభుత్వ ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాలకు సంబంధించి గరిష్ట వయోపరిమితిని పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు 34 ఏళ్లుగా ఉన్న గరిష్ట వయోపరిమితిని ఏకంగా 44 ఏళ్లకు పెంచారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ జీఏడీ ద్వారా జీవో ఎంఎస్ నెంబర్ 187ను విడుదల చేశారు. ఈ నిర్ణయం ముఖ్యంగా గత కొంతకాలంగా ఉద్యోగ నోటిఫికేషన్లు రాక, ఖాళీలు భర్తీ కాకపోవడంతో వయోపరిమితి దాటిపోతున్న అభ్యర్థులకు ప్రయోజనం చేకూరుస్తుంది. నిరుద్యోగ యువత విజ్ఞప్తులను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గ్లామర్ నుంచి బయోపిక్స్‌కు.. స్టార్ హీరోయిన్ల కొత్త రూట్!
Gold Price Today: బంగారం నేల చూపులు…ఈరోజు తులం గోల్డ్ ధర ఎంతంటే!
పండుగ పూట నిండుగా వానలు.. ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన ఖరీఫ్ టెన్షన్ తొలగిపోయినట్లేనా?
USలో భారత విద్యార్థులకు ఉపశమనం.. ట్రంప్ నిర్ణయానికి కోర్టు బ్రేక్
