ఏఐ వద్దు.. ఉద్యోగులే ముద్దు.. పెరిగిన ఏఐ ఖర్చు.. కంపెనీల పునరాలోచన

Updated on: Jun 06, 2026 | 5:11 PM

ఏఐ వల్ల ఉద్యోగాలు భారీగా పోతాయనే భయాల మధ్య, కొన్ని టెక్ కంపెనీలు ఏఐ వినియోగంపై పునరాలోచన చేస్తున్నాయి. టోకెన్ ఆధారిత ఖర్చులు పెరగడంతో, కొన్ని సందర్భాల్లో మానవ ఉద్యోగులతో పని చేయించుకోవడమే ఆర్థికంగా లాభదాయకమని భావిస్తున్నాయి. అయితే ఏఐ పూర్తిగా వెనక్కి తగ్గడం కాదు; ఉత్పాదకత పెంపులో కీలక పాత్ర పోషిస్తూనే, మానవ పర్యవేక్షణ అవసరం కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఏఐ వస్తే చాలా రంగాల్లో ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన ప్రస్తుతానికి తగ్గుతోందని చెప్పాలి. ఏఐ వాడకంపై కంపెనీలు పునరాలోచనలో పడటం ఇందుకు కారణం. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఊబర్‌ లాంటి పెద్ద పెద్ద కంపెనీలే ఏఐ కంటే మనుషులే మేలంటున్నాయి. ఎందుకిలా? మనుషులు చేసే ఉద్యోగాల్లో కోతలుంటాయా? ఉండవా? కోడింగ్‌ వేగంగా చేయవచ్చునన్న అంచనాతో మైక్రోసాఫ్ట్‌ చాలాకాలం క్రితమే సుమారు లక్ష మంది ఇంజనీర్లకు క్లాడ్‌ ఏఐ సబ్రస్కిప్షన్లు అందించింది. కానీ ఇంజనీర్లు రోజుకు కొన్ని లక్షల టోకెన్లు వాడేస్తూండటంతో భారం పెరిగిపోయింది. దీంతో ఆరు నెలల క్రితం సబ్‌స్క్రిప్షన్లను క్యాన్సిల్‌ చేసింది. ఉద్యోగుల జీతాలు, ఇతర ఖర్చులు కలుపుకుని చూసినా ఏఐ ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి. ఊబర్‌కు కూడా ఏఐ షాక్‌ తగిలింది. ఏడాది పొడవునా ఏఐ పై పెడదామనుకున్న డబ్బులు కాస్తా నాలుగు నెలల్లోనే ఖాళీ అయిపోయాయి. గూగుల్‌ కూడా ఏఐ వాడకం విషయంలో వెనక్కు తగ్గింది. ఈ మూడు కంపెనీల ఉద్దేశం మాత్రం ఒక్కటే…. ఏఐ వాడితే ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి… వీటికంటే ఇంజనీర్లతో పనిచేయించుకోవడమే మేలు అన్న అంచనాకు వచ్చాయి. ఏఐతో ఖర్చులు ఎందుకు పెరుగుతున్నాయి? అన్న ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం టోకెన్‌ ప్రైజింగ్‌ గురించి తెలుసుకోవాలి. ఏఐ వాడకానికి అయ్యే ఖర్చులను టోకెన్‌లలో లెక్కిస్తార్లు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు ఏదైనా ప్రాంప్ట్‌ ఇచ్చి కోడ్‌ రాయమంటే… అందులోని ఒక్కో టోకెన్‌కు నిర్దిష్ట మొత్తంలో డబ్బులు వసూలు చేస్తారు. ఎన్ని ఎక్కువ టోకెన్లు వాడితే అంత ఎక్కువ ఖర్చు అన్నమాట. కోడింగ్‌ చకచకా జరిగిపోతోంది కాబట్టి ఇంజనీర్లు టోకెన్లు తెగ వాడేస్తూండటంతో వారికిచ్చే జీతాల కంటే టోకెన్ల ఖర్చు ఎక్కువైపోయే పరిస్థితి వచ్చింది. దీంతో కంపెనీలన్నీ ఏఐ వాడకంపై పునరాలోచనలో పడ్డాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంజనీర్లు, అనలిస్టులు, కస్టమర్‌ సపోర్ట్‌ సిబ్బంది ఉద్యోగాలు సేఫ్‌. వీరి స్థానంలో ఏఐ వాడకం చాలా ఖరీదైన వ్యవహారమని కంపెనీలు గుర్తిస్తున్నాయి. AI స్కిల్స్‌ ఉన్న వారికి సమీప భవిష్యత్తులో మంచి డిమాండ్‌ ఉంటుందని అంచనా. ఒకవేళ ఇంకో ఐదు, పదేళ్లలో కంప్యూటింగ్‌ ఖర్చులు తగ్గితే కోడింగ్, డాక్యుమెంటేషన్‌ వంటివి ఏఐలు చేస్తాయి కానీ.. వాటిపై మానవ పర్యవేక్షణ తప్పనిసరి అంటున్నారు. మొత్తమ్మీద చూస్తే… ఏఐతో మన ఉద్యోగాలకు వచ్చిన ముప్పేమీ లేదు. ఉత్పాదకతను పెంచడంలో మాత్రం ఏఐ సహకారం అవసరమవుతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోడ్డుపై కరెన్సీ నోట్లు విసిరేసి.. ఓ రేంజ్‌లో పోలీస్‌ దొంగా ఛేజింగ్

90 ఏళ్ల అత్తగారిని బుట్టలో కూర్చోబెట్టి.. నెత్తిన పెట్టుకుని కోడలి పాదయాత్ర!

పక్క ఫ్లాట్‌ను దొంగచాటుగా రికార్డ్ చేస్తూ పట్టుబడ్డ వృద్ధుడు

2027లో AI తుఫాను? మూడేళ్లే టైమ్.. మేలుకోకపోతే మనుగడ కష్టమే

Follow Us