నిన్న కటిక నేలపై.. నేడు హాయిగా కుర్చీలో.. సిద్ధిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పరిస్థితి ఇదీ
సిద్దిపేట ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో గర్భిణీలు నేలపై కూర్చుని ఎదురుచూడాల్సి వస్తోందన్న వార్తపై వైద్య ఆరోగ్య శాఖ వెంటనే స్పందించింది. ఓపీ విభాగంలో రాత్రికి రాత్రే 50 ప్రత్యేక కుర్చీలను ఏర్పాటు చేసింది. దీంతో గర్భిణీ స్త్రీలు సౌకర్యవంతంగా కూర్చునే అవకాశం లభించగా, సమస్యను త్వరగా పరిష్కరించిన అధికారుల చర్యలను ప్రజలు అభినందిస్తున్నారు.
సిద్దిపేట ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలు పడుతున్న ఇబ్బందులపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సత్వరమే స్పందించారు. ఆసుపత్రిలో ఓపీ సేవల కోసం వచ్చే గర్భిణీల కొరకు రాత్రికి రాత్రే 50 ప్రత్యేక కుర్చీలను ఏర్పాటు చేశారు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి నిత్యం వందలాది మంది గర్భిణీ స్త్రీలు వైద్య పరీక్షల కోసం వస్తుంటారు. అయితే, ఓపీ విభాగం వద్ద వారు కూర్చోవడానికి తగినన్ని కుర్చీలు లేకపోవడంతో, గంటల తరబడి గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు పడుతూ నేలపైనే కూర్చున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు బయటకు వచ్చాయి. దీంతో గర్భిణీల పట్ల ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కథనంపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. సమస్య తీవ్రతను గుర్తించి, తెల్లవారేసరికల్లా గర్భిణీ స్త్రీల కోసం ప్రత్యేకంగా 50 కుర్చీలను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు ఆసుపత్రికి వచ్చే గర్భిణీలు హాయిగా కూర్చుని తమ వంతు వచ్చే వరకు వేచి ఉండేలా ఏర్పాట్లు చేయడంతో వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రెగ్నెన్సీ నుంచి బిడ్డకు 6 నెలలు వచ్చే వరకు.. రూ.4 లక్షలు ఖర్చు.. మరి చదువుల సంగతి?
మధుమేహం, గుండె జబ్బులు లేని “డిజైనర్ బేబీస్”
బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో షాకింగ్ దృశ్యాలు.. ఇది ఎయిర్‌పోర్టా.. రైల్వేస్టేషనా!
130 అడుగుల ఎత్తునుంచి పడినా బ్రతికే ఉంది.. కన్నీరు పెట్టిస్తున్న నర్స్ మాటలు !
భారీ ట్రాక్టర్‌ను తన రెక్కలతో ఆపేసిన పక్షి..! గుడ్ల రక్షణకు ప్రాణాలను పణంగా పెట్టిన మాతృప్రేమ
