Telangana: పోలీసుల తనిఖీల్లో తేడాగా కనిపించిన యువకుడు.. బ్యాగ్ చెక్ చేయగా.. వామ్మో

|

Nov 04, 2024 | 12:31 PM

ఓ వ్యక్తి అనుమానాస్పద రీతిలో కేసముద్రం పోలీసులకు పట్టుబడ్డాడు. అతడి వద్ద నుంచి 2.5లక్షల విలువ చేసే 10కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకొని రిమాండుకు తరించారు. ఇంతకీ అతడు ఎక్కడ నుంచి.? ఎక్కడికి వెళ్తున్నాడు.? గంజాయి ఎవరికి రవాణా చేస్తున్నాడో తెలియాల్సి ఉంది.

మహబూబాబాద్ జిల్లాలో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు కేసముద్రం పోలీసులు. అతడి వద్ద నుంచి 10 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకొని రిమాండు తరలించామని తెలిపారు మహబూబాబాద్ రూరల్ సి ఐ సర్వయ్య. కేసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పరపల్లి క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి అనుమానస్పదంగా కనిపించడంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. గంజాయి స్మగ్లింగ్ వ్యవహారం బయటపడింది.

ఒడిస్సా రాష్ట్రం గజపతి జిల్లా దుంగస్కల్ గ్రామానికి చెందిన కిషంత్ నాయక్ అనే వ్యక్తి ఒడిస్సా నుంచి నవజీవన్ ట్రైన్‌లో గంజాయి తీసుకొని అహ్మదాబాద్‌కు వెళ్తున్న క్రమంలో పోలీస్ చెకింగ్ చేస్తున్నారనే భయంతో మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లో దిగాడు. ట్రైన్ దిగి వరంగల్ వైపు రోడ్డు మార్గంలో వెళ్తుండగా కేసముద్రం పోలీసులకు పట్టుబడ్డాడు. అతడి వద్ద నుంచి 2.5లక్షల విలువ చేసే 10 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకొని రిమాండుకు తరలించారు పోలీసులు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Published on: Nov 04, 2024 12:31 PM