Breaking News
  • భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 31 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 131868. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 73560. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 54441. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 3867. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • కరోనా తెలంగాణా బులిటిన్. ఇవ్వాళ తాజాగా 41 పాజిటివ్ కేసులు నమోదు. మొత్తం రాష్ట్రంలో 1854 కరోనా పాజిటివ్ కేసులు . ఇవ్వాళ నలుగురు మృతి. మొత్తం ఇప్పటివరకు 53 మంది కరోనా కు బలి అయ్యారు. యాక్టీవ్ కేసులు 709 మంది చికిత్స పొందుతున్నారు.
  • తిరుమల: ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల రుసుము రీఫండ్. జూన్ 30వ తేది వరకు శ్రీవారి ఆర్జిత సేవలు, వీఐపీ దర్శన టికెట్లు, తిరుమలలో గదులు బుక్ చేసుకున్న భక్తులకు డబ్బులు రీఫండ్. టికెట్ల వివరాలను refunddesk_1@tirumala.org మెయిల్ ఐడీకి పంపాలని భక్తులను కోరిన టీటీడీ.
  • వరంగల్ 9 మర్డర్ కేసు లో సంచలన బ్రేకింగ్ . 9 మందిని హత్య చేసింది సంజయ్ . మాక్సుద్ భార్య చెల్లెలి తో సంబంధం ఉన్న సంజయ్. మాక్సుద్ భార్య చెల్లలి తో అక్రమ సంబంధం ఉన్న సంజయ్. తనకు అడ్డు రావొద్దని మాక్సుద్ కుటుంబం తో పాటు సన్నిహితంగా ఉన్న బిహారి యువకులను హత్య చేసిన సంజయ్.
  • CRPF జవాన్ లకు కరోనా పాజిటివ్. ఈ రోజు 9 మంది CRPF జవాన్ కి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరించిన వైద్యులు. దేశ వ్యాప్తంగా మొత్తం 359 CRPF సిబ్బందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరణ. 137 యాక్టీవ్ కేస్ లు. 220 మంది డిశ్చార్జ్, ఇద్దరు మృతి.
  • దేశ వ్యాప్తంగా భానుడి భగ భగ. పంజాబ్, హర్యానా, దక్షిణ యుపి, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, తీరప్రాంత ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉంటాయని IMD హెచ్చరిక.. రాబోయే 5 రోజుల్లో తీవ్రమైన హీట్ వేవ్ ఉంటాయని హెచ్చరిక.

Valentine’s Day Special: ఆమె ప్రేమ కథ అజరామరం.. కానీ..!

C Ramchandra Lata Mangeshkar Sad Love Story, Valentine’s Day Special: ఆమె ప్రేమ కథ అజరామరం.. కానీ..!

కొన్ని ప్రేమ కథలు అస్సలు అర్థం కావు… ప్రేమలో ఉన్నంతకాలం బాగానే ఉంటుంది.. తేడా కొట్టిందా ..? అదే ప్రేమ ద్వేషంగా మారుతుంది.. ఎంతగా అంటే ఆ వ్యక్తి పేరును కూడా ఉచ్చరించడానికి కూడా ఇష్టపడనంతగా..! ఆరు దశాబ్దాలనాటి ఓ అపురూప ప్రణయగాథ ..ఇలాగే ప్రేమతో మొదలయ్యి ద్వేషంతో ముగిసింది.. ఈ ప్రేమకథలో హీరోయిన్‌ ప్రపంచంలోనే అత్యద్భుత గాయనీమణిగా పేరుగాంచిన లతా మంగేష్కర్‌… ఆమె వలచిన కథానాయకుడు సంగీత దర్శకుడు సి.రామచంద్ర…చాలా ప్రేమ కథల్లాగే ఇది కూడా అసంపూర్ణంగా మిగిలి… విషాదంగా ముగిసింది… ఎక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ…హాయిగా మొదలైన ప్రణయం ద్వేషంగా మారింది….ఇందులో సమిధగా మారింది మాత్రం సి.రామచంద్రే!
C Ramchandra Lata Mangeshkar Sad Love Story, Valentine’s Day Special: ఆమె ప్రేమ కథ అజరామరం.. కానీ..!
రామచంద్ర చితల్కర్‌ మహారాష్ట్ర బ్రాహ్మణుడు… పూణె, నాగపూర్‌లలో శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాడు.. ఆ తర్వాత దక్షిణాదికి వచ్చి ఒకట్రెండు సినిమాలకు సంగీతం అందించాడు.. సరైన గుర్తింపు రాకపోవడంతో బొంబాయికి షిఫ్టయ్యాడు. రకరకాల పేర్లతో అనేక పాటలు పాడాడు. ఆ తర్వాత అక్కడ సంగీత దర్శకుడయ్యాడు.. అనతి కాలంలోనే అద్భుతమైన సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు… కేవలం రామచంద్ర మ్యూజిక్‌ కారణంగా హిట్టయిన సినిమాలు కూడా ఉన్నాయి… ఇక లతా మంగేష్కర్‌ను లతలా తీర్చిదిద్దింది రామచంద్రే! సినిమాల్లోకి వచ్చిన తొలినాళ్లలో లతామంగేష్కర్‌పై గాయన నటి నూర్జహాన్‌ ప్రభావం ఎక్కవగా ఉండేది… చాలా మట్టుకు నూర్జహాన్‌ను అనుకరించేది.. అలాంటి లతను నూర్జహాన్ ప్రభావం నుంచి తప్పించి లతగా నిలబెట్టిన వ్యక్తి రామచంద్ర… ఆయన సంగీతంలో వచ్చిన నిరాలా సినిమా లతను సంగీత ప్రియులకు చాలా దగ్గర చేసింది.. సర్‌గమ్… షిన్‌షినాకి బూబ్ల బూ వంటి సినిమాలు రామచంద్ర, లతా కాంబినేషన్‌ను పాపురల్‌ చేశాయి… ఇక 1953లో వచ్చిన అనార్కలి అయితే శిఖరాగ్రాన నిలబెట్టింది.. అప్పటికీ బొంబాయిలో తిరుగులేని గాయని గీతాదత్‌.. అనార్కలిలో గీతాదత్‌తోనే పాటలు పాడించాలనుకున్నారంతా.. నిర్మాత దర్శకుల కోరిక కూడా అదే! రామచంద్ర మాత్రం లత తప్ప మరొకరు పాడ్డానికి వీల్లేదని కరాఖండిగా చెప్పేశాడు.. అనార్కలి సినిమా తర్వాత లత తిరుగులేని గాయని అయ్యింది.. ఇదంతా రామచంద్ర పుణ్యమే! ఆయన అద్భుతమైన బాణీలు లతను సంగీత ప్రియులకు చాలా దగ్గర చేశాయి.. రామచంద్ర కూడా రిహార్సిల్స్‌లో ఫుల్‌ ఆర్కెస్ట్రా ముందు కూచోబెట్టించి మరీ ఆమెతో పాడించేవాడు.. ఆమె కోసమే ప్రత్యేకించి బాణీలు కట్టేవాడు.. నెమ్మదిగా ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం పెరిగింది.. లతకేమో రామచంద్ర జీవితంలో అడుగుపెట్టాలనే కోరిక బలంగా ఉండేది.. రామచంద్రకు మాత్రం ఆ ఉద్దేశం లేదు. ఎందుకంటే అప్పటికే ఆయనకు పెళ్లయ్యింది..
C Ramchandra Lata Mangeshkar Sad Love Story, Valentine’s Day Special: ఆమె ప్రేమ కథ అజరామరం.. కానీ..!
అప్పట్లో అతను సెంట్రల్‌ బొంబాయిలోని శివాజీపార్క్‌ దగ్గర ఉండేవాడు.. రికార్డింగులు లేనప్పుడల్లా లత అక్కడే కనిపించేది. తర్వాతి కాలంలో రామచంద్ర వైవాహిక జీవితమే ముఖ్యమనుకున్నాడు. దాంతో అభిమానవంతురాలైన లతకు అహం దెబ్బతింది…ఆనాటికే ఆమె సంగీత ప్రపంచానికి మకుటం లేని మహారాణి అయ్యింది.. అందరూ తన చుట్టూ తిరుగుతుంటే తను రామచంద్ర చుట్టూ తిరగాల్సి రావడమేమిటని ఆవేదన చెందింది.. నెమ్మదిగా రామచంద్రకు దూరమయ్యింది.. రామచంద్రతో పని చేయడం కుదరదని బహిరంగంగానే చెప్పేసింది.. లత పాటలు లేక రామచంద్ర సంగీతం కూడా కళ తప్పింది.. క్రమంగా సినిమాలు తగ్గాయి.. ఓ మహాద్భుత సంగీత దర్శకుడు నెమ్మదిగా కనుమరుగయ్యాడు.. లత-రామచంద్ర మధ్య ఏం జరిగిందో ఎవరికీ తెలియదు.. ఆ తర్వాత లతా మంగేష్కర్‌ దేశ విదేశాల్లో అనేక కచేరీలు చేసింది.. రామచంద్ర స్వరపరచిన పాటలను మాత్రం ఉద్దేశపూర్వకంగానే పాడకపోయేది.. నిజానికి లతా మంగేష్కర్‌ పాడిన 25 అత్యుత్తమ పాటల్లో రామచంద్రవి కచ్చితంగా రెండు మూడు ఉంటాయి.. మ్యూజికల్‌ నైట్స్‌లో రామచంద్ర పాటలను లత పాడకూడదనుకున్నా.. శ్రోతలు వదిలేవారు కాదు.. పట్టుబట్టి నాలుగైదు పాటలు పాడించుకునేవారు.. వీటిల్లో అనార్కలి మస్ట్‌… అయినా ఒక్కసారి కూడా రామచంద్ర పేరు ఉచ్చరించేది కాదు.. తన పుస్తకాల్లో కూడా అతని ప్రస్తావన లేకుండా చేసింది…పది పన్నేండేళ్ల కిందట తప్పనిపరిస్థితుల్లో రామచంద్ర పేరును చెప్పాల్సివచ్చింది… అతనో గొప్ప సంగీత దర్శకుడని మాత్రమే అనేసి వదిలేసింది… సింగర్‌గా తను ఎదగడానికి దోహదపడిన మహానుభావులు అనిల్‌ బిస్వాస్‌, సలీల్‌ చౌదరిలని చెప్పుకుంది. నూర్జహాన్‌ ప్రభావం నుంచి బయటకు తెచ్చింది అనిల్‌ బిస్వాసేనని పదే పదే చెప్పుకునేది… పాపం రామచంద్ర కూడా అంతే… కాలక్రమంలో లత పేరును ఎప్పుడూ ప్రస్తావించలేదు.. తన ఆటోబయోగ్రఫీలో కూడా లత ప్రస్తావన తీసుకురాలేదు.. సీత అనే అమ్మాయి కథను మాత్రం పేజీలకు పేజీలు రాశాడు…ఆ సీతే లత అనుకోవాలి… ఓ సంగీత ప్రియుల ప్రణయగాథ అలా కరిగిపోయింది…ప్రేమ సఫలం అయివుంటే…రామచంద్ర నుంచి అద్భుతమైన బాణీలొచ్చేవేమో… లత గొంతునుంచి అవి జాలువారి అచిరకీర్తిని పొందేవేమో!

C Ramchandra Lata Mangeshkar Sad Love Story, Valentine’s Day Special: ఆమె ప్రేమ కథ అజరామరం.. కానీ..!C Ramchandra Lata Mangeshkar Sad Love Story, Valentine’s Day Special: ఆమె ప్రేమ కథ అజరామరం.. కానీ..!

(వాలెంటైన్ డే సందర్భంగా ప్రత్యేక కథనం)

 

Related Tags