Breaking News
  • తెలుగు రాష్ట్రాలకు రూ.10లక్షలు విరాళం. మలికిపురం మండలం మట్టపర్రు సొంత గ్రామానికి తనవంతు సహాయంగా 5లక్షలు అందజేత.. తన కుటుంబ సభ్యుల ద్వారా తన గ్రామంలో రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ వెయ్యి రూపాయల చొప్పున పంపిణీ.. కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని పిలుపు..
  • న్యూఢిల్లీ: కరోనా వైరస్ పై జరుగుతున్న యుద్ధంలో విజయం సాధించాలంటే ప్రజల సహకారం మరింత అవసరమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.
  • కాశ్మీర్ లోయలో ఒక్కరోజులోనే 7 కొత్త కరోనా కేసుల నమోదు. శ్రీనగర్‌లో విదేశాలకు వెళ్లొచ్చిన ముగ్గురికి, మతపరమైన ప్రార్థనలకు హాజరైన నలుగురికి కరోనా పాజిటివ్. పాజిటివ్ కేసుల కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలు పెట్టిన అధికారులు.
  • విజయనగరం : టివి9 సమచారంతో స్పందించిన విశాఖ రీజియన్ డిఐజి కాళిదాసు రంగారావు ఏపి చెన్నై బోర్డర్ అధికారులతో పాటు చైన్నై కి చెందిన పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడిన డిఐజి విజయనగరం జిల్లాకు చెందిన వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని విన్నపం బాధితులతో మాట్లాడిన రంగారావు.
  • సూర్యాపేట: మోతె మండలం రాఘవ పురం,నామవరం గ్రామాల్లో దళిత కాలనిలో ఇంటి ఇంటికి తిరిగి కూరగాయలు పంపిణీ చేసిన ఎంపీపీ మీ ఆశా శ్రీకాంత్ రెడ్డి. పంచిన ఎంపీపీ ఆశశ్రీకాంత్ రెడ్డి, పాల్గొన్న సర్పంచ్ లు,ఆశా వర్కర్లు, పోలీస్ సిబ్బంది.
  • కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోల నుంచి సినీ నిర్మాతల నుంచి , దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు.
  • తెలంగాణలో లాక్‌డౌన్‌ ఉన్నా కొంతమంది ఖాతరు చేయడం లేదు. అడ్డదారుల్లో రాష్ట్ర సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. కంటైనర్‌లో వందల మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు.
  • కరోనా పిశాచి అంతకంతకూ కోరలు చాస్తూ విలయతాండవం చేస్తోంది.. అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయలేకపోతోంది. అక్కడ ఒక్కరోజే 18 వేల కొత్త కేసులు నమోదయ్యాయి.

తాలిబన్లతో అమెరికా శాంతి జపం.. ఇండియాకూ ఆహ్వానం

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లతో అమెరికా శాంతి ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ సందర్భంగా శనివారం ఖతర్ రాజధాని దోహాలో జరిగే ఒప్పంద కార్యక్రమానికి.. ఖతర్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు అక్కడి భారత రాయబారి పి.కుమారన్  హాజరు కానున్నారు.
us taliban peace deal.. us president trump pm modi initiative, తాలిబన్లతో అమెరికా శాంతి జపం.. ఇండియాకూ ఆహ్వానం

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లతో అమెరికా శాంతి ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ సందర్భంగా శనివారం ఖతర్ రాజధాని దోహాలో జరిగే ఒప్పంద కార్యక్రమానికి.. ఖతర్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు అక్కడి భారత రాయబారి పి.కుమారన్  హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి ముందే శుక్రవారం విదేశాంగ కార్యదర్శి హర్ష వర్ధన్ ష్రింగ్లా.. కాబూల్ వెళ్లి ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనికి ప్రధాని మోదీ రాసిన ఓ లేఖను అందజేశారు. నవంబరు 9 న జరిగిన ఉగ్రవాద దాడుల నేపథ్యంలో.. ఆఫ్ఘన్ లో అమెరికా తన సైనిక దళాలను పెద్ద ఎత్తున మోహరించింది. 2001 నుంచి తాలిబన్లకు, అమెరికన్ సైనికులకు మధ్య జరిగిన పోరులో 2 వేల మందికి పైగా యూఎస్ సోల్జర్స్ మరణించారు. ఆఫ్ఘనిస్తాన్ లో ఇప్పటికైనా శాంతి నెలకొనాలని అమెరికా, ఇండియా కూడా భావిస్తున్నాయి.

తాలిబన్లతో అమెరికా కుదుర్చుకునే ఒప్పంద కార్యక్రమానికి ఇండియా ‘అబ్జర్వర్’ గా హాజరు కాబోతోంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఆఫ్ఘన్ నుంచి వేలాది అమెరికన్ సైనికులనుఉపసంహరిస్తారు. అలాగే తాలిబన్లు, రాజకీయ, సివిల్ సొసైటీ బృందాలు ఆఫ్ఘన్ ప్రభుత్వంతో లాంఛనప్రాయ చర్చలు జరిపేలా సానుకూల వాతావరణం సృష్టిస్తారు.

అమెరికా, తాలిబన్ల మధ్య కుదిరే ఒప్పంద కార్యక్రమానికి ఇండియా అధికారికంగా హాజరు కానుండడం ఇదే మొదటిసారి. ఆఫ్ఘనిస్తాన్ లో శాంతి నెలకొనేలా చూడడంలో ఇండియా కీలక పాత్ర పోషిస్తోంది. అయితే ఉగ్రవాదులైన తాలిబన్లతో యుఎస్ ఇలా అగ్రిమెంట్ కుదుర్చుకోవడం  ఏమిటో అర్థం కావడంలేదని విదేశాంగశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. సహజంగా ఈ విధమైన వైఖరి మన విధానానికే విరుధ్ధమని ఈ వర్గాలు అభిప్రాయపడ్డాయి.

అయితే శాంతి డీల్ పై తాను ప్రధాని మోదీతో చర్చించానని, దీనిపై సంబంధింత వర్గాలన్నీ సంతోషంగా ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఈ విషయంలో ఇండియా జోక్యం చేసుకోవాలని భావిస్తున్నానని ఆయన ఇటీవల ఢిల్లీలో మీడియాకు వెల్లడించారు. ఏమైనా … ఆప్ఘనిస్తాన్ లో శాంతి నెలకొనేలా చూడడంలో భారత ప్రభుత్వ కృషి ఏమోగానీ మొదట శాంతి నెలకొనాల్సింది ఢిల్లీ నగరంలో అని విమర్శకులు పేర్కొంటున్నారు. ఢిల్లీ అల్లర్లలో 40 మందికి పైగా మృతి చెంది 200 మందికి పైగా గాయపడితే ఇక్కడ శాంతి, సామరస్యాలను పునరుధ్ధరించేందుకు అటు కేంద్రం గానీ, ఇది ఢిల్లీ ప్రభుత్వం గానీ పెద్దగా చర్యలు తీసుకోని విషయాన్ని వీరు ప్రస్తావిస్తున్నారు.

 

Related Tags