తొలిసారి ఇరాన్ ఇంధ‌న నౌక‌ల‌ను సీజ్ చేసిన అమెరికా !

ట్రంప్ ప్ర‌భుత్వం విధించిన ఆంక్షలను ఉల్లంఘించిన నేప‌థ్యంలో ఇంధనంతో నిండిన‌ ఇరాన్ నౌకలను అమెరికా తొలిసారిగా సీజ్ చేసిన‌ట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ గురువారం తెలిపింది.

తొలిసారి ఇరాన్ ఇంధ‌న నౌక‌ల‌ను సీజ్ చేసిన అమెరికా !
Follow us

|

Updated on: Aug 14, 2020 | 3:27 PM

ట్రంప్ ప్ర‌భుత్వం విధించిన ఆంక్షలను ఉల్లంఘించిన నేప‌థ్యంలో ఇంధనంతో నిండిన‌ ఇరాన్ నౌకలను అమెరికా తొలిసారిగా సీజ్ చేసిన‌ట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ గురువారం తెలిపింది. ఇరాన్, వెనిజులాకు రవాణా చేయడానికి ప్రయత్నిస్తున్న నాలుగు ట్యాంకర్లలోని గ్యాసోలిన్‌ను స్వాధీనం చేసుకోవాలని యుఎస్ ప్రాసిక్యూటర్లు గత నెలలో దావా వేశారు. అమెరికా శత్రువులపై ఆర్థిక ఒత్తిడిని పెంచడానికి ట్రంప్ స‌ర్కార్ ఈ నిర్ణ‌యం తీసుకున్నట్లు తెలుస్తోంది. చమురు అమ్మకాల నుంచి ఇరాన్‌కు వచ్చే ఆదాయ ప్రవాహాన్ని ఆపాలని ఈ వ్యాజ్యం లక్ష్యంగా పెట్టుకుంది. మ‌రోవైపు అణ్వాయుధాలు, బాలిస్టిక్ క్షిపణులతో స‌హాయంలో మిడిల్ ఈస్ట్ అంతటా ప్రభావం చూపిస్తోన్న ఇరాన్..అవ‌న్నీ త‌మ‌ శాంతియుత ప్రయోజనాల కోసం అని చెబుతోంది. లూనా, పాండి, బెరింగ్, బెల్లా అని పిలువబడే నాలుగు నౌకలను ఇటీవలి రోజుల్లో సముద్రాలలో స్వాధీనం చేసుకున్నార‌ని, ఇప్పుడు హ్యూస్టన్‌కు త‌ర‌లిస్తున్నార‌ని వాల్ స్ట్రీట్ జ‌ర్న‌ల్ నివేదించింది.

Also Read :

బీజేపీ నేత సాధినేని యామినిపై పోలీసు కేసు

ఏపీ విద్యార్థుల‌కు గుడ్ న్యూస్ : ఈ నెలలో ఒకేసారి 90 గుడ్లు పంపిణీ