యూఎస్ సుప్రీంకోర్టు జడ్జిగా అమీ కోనే, ప్రకటించిన ట్రంప్

అమెరికా సుప్రీంకోర్టు నూతన జడ్జిగా అమీ కోనే బారెట్ ని అధ్యక్షుడు ట్రంప్ నియమించారు. ఈ కోర్టు న్యాయమూర్తి రూత్ బేడర్ గిన్స్ బెర్గ్ ఇటీవల మరణించడంతో ఆమె స్థానే అనీ కోనేను ఆయన నియమించారు. ఈ సందర్భంగా ఆమెను..

యూఎస్ సుప్రీంకోర్టు జడ్జిగా అమీ కోనే,  ప్రకటించిన ట్రంప్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 27, 2020 | 6:13 PM

అమెరికా సుప్రీంకోర్టు నూతన జడ్జిగా అమీ కోనే బారెట్ ని అధ్యక్షుడు ట్రంప్ నియమించారు. ఈ కోర్టు న్యాయమూర్తి రూత్ బేడర్ గిన్స్ బెర్గ్ ఇటీవల మరణించడంతో ఆమె స్థానే అనీ కోనేను ఆయన నియమించారు. ఈ సందర్భంగా ఆమెను  ‘అమిత మేధాశక్తి కలిగిన మహిళ’గా  ట్రంప్ అభివర్ణించారు. న్యాయవ్యవస్థకు ఆమె పూర్తి న్యాయం చేస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇక తనను ఈ పదవిలో నియమించినందుకు అమీ కోనే..ట్రంప్ కు ధన్యవాదాలు తెలిపారు. నేను ఈ దేశాన్ని, ఈ దేశ రాజ్యాంగాన్ని ఎంతగానో అభిమానిస్తున్నానని, సుప్రీంకోర్టు జడ్జిగా తన విధులను సమర్థంగా నిర్వర్తిస్తానని ఆమె చెప్పారు. ప్రస్తుతం ఈమె సెవెంత్ సర్క్యూట్ కోర్టు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికలకు మరో 40 రోజులు ఉండగా ట్రంప్ ఈ నియామకాన్ని చేపట్టారు. ఇందుకు డెమొక్రాట్ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఆయన పట్టించుకోలేదు.