జార్ఖండ్‌లో దారుణం.. మహిళపై 12మంది అత్యాచారం!

రాంచీలోని కాంకేలో ఒక విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసులో 12 మంది నిందితులను జార్ఖండ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో సునీల్ ముండా, కుల్దీప్ ఒరాన్, సునీల్ ఒరాన్, సందీప్ టిర్కీ, అజయ్ ముండా, రాజన్ ఒరాన్, నవీన్ ఒరాన్, అమన్ ఒరాన్, బసంత్ కచాప్, రవి ఒరాన్, రోహిత్ ఒరాన్ మరియు రిషి ఒరాన్ ఉన్నారు. నిందితుల నుంచి కారు, బైక్, రెండు మ్యాగజైన్స్, మూడు బుల్లెట్లు, దేశీయంగా తయారు చేసిన పిస్టల్, […]

జార్ఖండ్‌లో దారుణం.. మహిళపై 12మంది అత్యాచారం!
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 30, 2019 | 5:59 PM

రాంచీలోని కాంకేలో ఒక విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసులో 12 మంది నిందితులను జార్ఖండ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో సునీల్ ముండా, కుల్దీప్ ఒరాన్, సునీల్ ఒరాన్, సందీప్ టిర్కీ, అజయ్ ముండా, రాజన్ ఒరాన్, నవీన్ ఒరాన్, అమన్ ఒరాన్, బసంత్ కచాప్, రవి ఒరాన్, రోహిత్ ఒరాన్ మరియు రిషి ఒరాన్ ఉన్నారు. నిందితుల నుంచి కారు, బైక్, రెండు మ్యాగజైన్స్, మూడు బుల్లెట్లు, దేశీయంగా తయారు చేసిన పిస్టల్, ఎనిమిది మొబైల్ ఫోన్లు, బాధితురాలి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) మాట్లాడుతూ, నవంబర్ 26 న, 25 ఏళ్ల ఒక న్యాయ విద్యార్థిని తన స్నేహితుడితో కలిసి రోడ్డు పక్కన ఉండగా, కొంతమంది గుర్తు తెలియని యువకులు ఆ మహిళను పిస్టల్ తో బెదిరించి అపహరించారు. ఆపై ఇటుక బట్టీలో సామూహిక అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కాంకే పోలీస్‌స్టేషన్‌లో సామూహిక అత్యాచారం కేసు నమోదైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు.